YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

10 ఏళ్లు దాటిన వాహానాలు.. నో ఎంట్రీ

10 ఏళ్లు దాటిన వాహానాలు.. నో ఎంట్రీ

తిరుమల ఘాట్ రోడ్లు.. ఎంతో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్లు సైతం రోడ్ల మలుపుల్లో కొన్ని సార్లు తప్పులు చేస్తూ ఉంటారు. అందుకే చాలా సార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక కొన్ని కొన్ని సార్లు ఏ మాత్రం ఫిట్నెస్ లేని వాహనాలను తీసుకుని వస్తూ ఉంటారు. ఇది కూడా ప్రమాదంతో కూడుకున్నదే.. చాలా అనుభవం ఉన్న డ్రైవర్లు కూడా ఫిట్నెస్ లేని వాహనాలను కంట్రోల్ చేయలేరు. ఈ ప్రమాదాలను ముందుగానే పసిగట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం సరికొత్త నిబంధనలను తీసుకుని వచ్చింది. వాహనం కొనుగోలు చేసి, పదేళ్లు దాటితే ఇకపై తిరుమల కొండ మీదకు నో ఎంట్రీ అని చెబుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు దాటిన వాహనాలను తిరుమల కొండపైకి అనుమతించరాదని టీటీడీ నిర్ణయించింది. ఏఎస్పీ మునిరామయ్య ఈ విషయాన్ని వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, కాలపరిమితి దాటిన వాహనాలతో కొండపైకి రావద్దని కోరారు. అలిపిరి చెక్ పోస్టు వద్ద వాహనాల కాలపరిమితిని తనిఖీలు చేసి, భక్తులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.ముఖ్యంగా తిరుమలలో 'నో హారన్ జోన్' అమలవుతోందని.. హారన్ మోగిస్తే, జరిమానాలు తప్పవని కూడా హెచ్చరించారు. ఘాట్ రోడ్డుపై ఫిట్ నెస్ లేని వాహనాలతో ప్రయాణాలు ప్రమాదానికి కారణమని, అటువంటి వాహనాలతో ప్రయాణిస్తే, చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పది సంవత్సరాల సమయం కేవలం ప్రైవేట్ వాహనాల విషయంలోనేనా, ప్రభుత్వ బస్సుల విషయంలో కూడా అమలు చేస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. కరోనా, లాక్ డౌన్ కారణంగా మార్చిలో మూతబడిన తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గాన్ని టీటీడీ తిరిగి తెరిచింది. మార్చి 20న మూతపడిన మార్గాన్ని గురువారం నుంచి తిరిగి తెరుస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే భక్తులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Related Posts