YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నో క్రాకర్స్.. ఓన్లీ పూజ

నో క్రాకర్స్.. ఓన్లీ పూజ

ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇప్పుడు దీపావళి సందర్భంగా ప్రజలంతా బాణాసంచా కాల్చితే కాలుష్యం మరింతగా పెరిగిపోతుంది. అందుకే క్రాకర్స్ లేకుండా కాలుష్యం పెరగనీయకుండా దీపావళి జరుపు కుందామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కేబినెట్ మంత్రులందరూ కలిసి లక్ష్మీ పూజని నిర్వహించనున్నారు.పూజ నిర్వహణ మొదటినుండి చివరి వరకు టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతుందని కనుక ఢిల్లీ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెబ్ కాస్ట్ ద్వారా మాట్లాడుతూ అన్నారు. ‘మనందరం కలిసి దీపావళిని జరుపుకుందాం... కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాకర్స్ ని కాల్చడానికి వీల్లేదు. బాణాసంచాని కాల్చడం అంటే...మనం మన పిల్లల, కుటుంబ సభ్యుల జీవితాలతో చెలగాటం ఆడటమే. దీపావళి నాడు రాత్రి గం.7.39ని. లకు మనమంతా కలిసి లక్ష్మీ పూజని చేద్దాం’ అన్నారాయన. తన సహమంత్రులతో కలిసి పూజని మొదలుపెడతానని, అది టెలి కాస్ట్ అవుతుందని కేజ్రీవాల్ వివరించారు.ప్రజలందరూ టీవీలను ఆన్ చేసి పూజారులు చెప్పే మంత్రాలను వింటూ పూజలో పాల్గొనాలని కోరారు. ‘రెండుకోట్ల మంది ఢిల్లీ ప్రజలు మంత్రాలను ఒకేసారి జపిస్తే... 14 ఏళ్ల వనవాసానికి వెళ్లినరాముడిని తిరిగి స్వగృహానికి ఆహ్వానిస్తే... ఢిల్లీ అంతటా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నేను నమ్ముతున్నాను’ అన్నారాయన.ఢిల్లీలో పర్యావరణ శాఖా మంత్రి గోపాల్ రాయ్ యాంటీ క్రాకర్ ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రీన్ క్రాకర్స్ ని మాత్రమే తయారుచేసి, అమ్మేలా చర్యలు తీసుకోవాలని...ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీని, జిల్లా మెజిస్ట్రేటులను, ఢిల్లీ పోలీసులను ఆయన కోరారు.  ఇదిలా ఉండగా... నవంబరు ఏడు నుండి ముప్పయ్యో తారీఖు వరకు బాణాసంచా కాల్చడాన్ని నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్... కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖకి, నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.దాంతో రాజస్థాన్, హర్యానా, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు బాణాసంచాని నిషేధించాయి. వాయుకాలుష్యంతో పాటు, కరోనాని దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా ఈ నిబంధనని పాటించాలని ఆయా రాష్ట్రప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.  

Related Posts