YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ‘కుంభకోణాల వ్యవహారాల’ ఫై ఢిల్లీ ఫోకస్!

ఏపీ ‘కుంభకోణాల వ్యవహారాల’ ఫై ఢిల్లీ ఫోకస్!

బిజెపి, టీడీపీల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన తర్వాతే ఏపీలో జరిగిన ‘కుంభకోణాల వ్యవహారాల’ గుట్టు రట్టు చేసేందుకు ఢిల్లీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఇందులో భాగంగా మెగా మెగా, బడా  కాంట్రాక్టర్లను ఢిల్లీకి పిలిపించి కీలక సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  ఏ ప్రాజెక్టులో ఎవరికి ఎంత సమర్పించింది..అందులో జరిగిన కుంభకోణాల సమాచారం మొత్తం పూసగుచ్చినట్లు కొంత మంది కాంట్రాక్టర్లు ఢిల్లీకి నివేదించినట్లు సమాచారం. అంటే ఏ క్షణంలో అయినా రంగంలోకి దిగిందుకు అవసరమైన ‘వివరాలు’ సేకరించి పెట్టుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఏపీలో అత్యధిక కుంభకోణాలు..దోపిడీలు జరిగింది సాగునీటి శాఖలోనే కావటంతో…కీలక కాంట్రాక్టులకు సంబంధించిన డాటా మొత్తం సేకరించి పెట్టుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.పోలవరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరగటంతోపాటు..భూ సేకరణ విషయంలోనూ వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ ఐఏఎస్ నుంచి కూడా ఢిల్లీ పెద్దలు సమగ్ర సమాచారం సేకరించారు. ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉన్నట్లు పైకి కన్పిస్తున్నా..అసలు కథ త్వరలోనే ప్రారంభం కాబోతుందని చెబుతున్నారు. అయితే ఇది ఎప్పుడు…ఎలా అన్నదే తేలాల్సి ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఓ వైపు ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కూడా చంద్రబాబు సర్కారు ఏ మాత్రం వెనకంజ వేయటం లేదు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి…తాము దోచుకునే విధంగా పెద్దలు స్కీమ్ లు అమలు చేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఓ వైపు నిప్పు నిప్పు అని చెప్పుకుంటూ…చంద్రబాబు ఇంకా తన ‘స్కీమ్’లు అమలు చేస్తూనే ఉన్నారనే అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Related Posts