YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తొంభై శాతం హమీలు అమలు

తొంభై శాతం హమీలు అమలు

నాడు ప్రజలతో...నేడు ప్రజలు కోసం వైస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తి సందర్బంగా ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరు లో  శుక్రవారం పాదయాత్ర జరిపారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. మంత్రికి అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. పాదయాత్ర లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహాంగా పాల్గోన్నారు. ముకుళిత హస్తాలతో ప్రజలకు అభివాదం తెలుపుతూ పాదయాత్ర చేస్తున్న మంత్రి ఆళ్ల నానికి మహిళలు పలుచోట్ల హారతులు పట్టారు. మంత్రి మాట్లాడుతూ రాజకీయాల్లో కొత్తతరం నేతగా వైస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోంది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ కేలెండర్ ఇచ్చామని అన్నారు. 14నెలలు పాటు జరిగిన సుదీర్ఘ పాదయాత్రలో 3, 648కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా లక్షలాది మంది ప్రజలను నేరుగా కలవడం ఒక రికార్డు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి తొలి సంతకం నుంచి గడిచిన 17నెలలు కాలంలోనే మ్యాను పెస్టో లో ఇచ్చిన హామీల్లో 90శాతం అమలు చేసిన ఘనత వైస్సార్సీపీ ప్రభుత్వానిది. ఒక వైపు చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని ఊహకు అందనంత అప్పుల్లో పడేసి అప్పగిస్తే,  మరో వైపు ప్రపంచంలోనే భయంకరమైన మహమ్మారి కరోనా కమ్మిన కష్ట కాలం. మొక్కవోని దీక్షతో ఖర్చుకు వెనుకాడక రాష్ట్రానికి పునర్జీవం తెచ్చిన నాయకుడు వైస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కోవిడ్ కాలంలో కూడ పేద ప్రజలు నిబ్బరంగా ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రభుత్వం పని తీరు కొలమానం. 2017నవంబర్ 6న ఇడుపులపాయనుంచి వైస్ జగన్మోహన్ రెడ్డి  మొదలు పెట్టిన పాదయాత్ర రాష్ట్రములో 134అసంబ్లీ నియోజకవర్గాల్లో సాగుతూ 14నెలలు పాటు 3, 648కిలోమీటర్లు పొడవు ఇచ్చాపురం వరకు సాగిందని మంత్రి గుర్తు చేసారు.

Related Posts