కర్నూలు జిల్లా గడివేములలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కరోనా సోకకుండా ఉండటానికి వినూత్నమైన అలోచన చేశాడు.ఏకంగా క్లాస్ రూంలో చెప్పాల్సిన పాఠాలను అరుబయట చెబుతూ, విద్యార్థులకు మద్య చీరలు కట్టి పాఠాలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పాఠాలు చెబుతూ తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా చర్చకు దారితీసింది.
గడివేముల జిల్లా పరిషత్తు పాఠశాలలో విద్యార్థులకు కరోనా రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా వినూత్న అలోచన చేశారు. పాఠశాలలోని 9, 10 తరగతుల ఉర్దూ మాధ్యమం విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపా ధ్యాయుడు నూరుల్లా రకీబ్ బుధవారం చీరలతో ప్రత్యేక అరలుగా విభజించి పాఠాలు బోధించారు. పాఠాలు బోధిస్తూ తీసిన వీడియో వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు అగ్రహం వ్యక్తం చేయ్యడంతో చీరలు తొలగించి భౌతిక దూరం పాటిస్తూ ఉపాధ్యాయులు పాఠాలు చెప్పారు.