YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

బీసీలపై కేంద్రానికి చిత్తశుద్ది లేదు

బీసీలపై కేంద్రానికి చిత్తశుద్ది లేదు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏక్కడాలేని విధంగా బి సీ కులాల సంక్షేమం, అభివృద్ది కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారని, ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి  కెసిఆర్  నిధులు విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర బి సి సంఘాల ప్రతినిధులు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  వి. శ్రీనివాస్  ను మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతాభినందనలు తెలిపారు.
 ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. బి సీ కులాల ఆత్మగౌరవ భవనాలకు నిధులు పెంచిన ఘనత ముఖ్యమంత్రి  కెసిఆర్ కే దక్కిందన్నారు. గత ప్రభుత్వాలు, పాలకులు బి సీలను ఓటు బ్యాంక్ గానే భావించి నిర్లక్ష్యం చేసాయన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన గత ఆరు సంవత్సరాలలో బి సీ ల సర్వతోముఖాభివృద్దికి సిఎం కెసిఆర్  శ్రీకారం చుట్టి అత్మగౌరవంతో జీవించేందుకు కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకవచ్చారన్నారు.
 ఉమ్మడి రాష్ట్రంలో గత 70 ఏళ్ళలో 17 బి సీ గురుకులాలను స్థాపిస్తే...తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత ఆరేళ్లలో వెయ్యి  కి పైగా  బి సీ ,ఎస్సీ, ఎస్టీ గురుకులాలను స్థాపించి బి సీల కు అధునిక విద్య, పౌష్టికాహరం కోసం సుమారు 1లక్ష 25 వేల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో సంక్షేమ హస్టల్స్ లో పురుగుల అన్నం, నీళ్ల చారు పేడుతున్నారని బి సీ సంఘాల నాయకులు దర్నాలు చేసిన సంఘటనల ఎన్నో ఉన్నాయన్నారు. ఇప్పుడు తెలంగాణ  రాష్ట్రంలో గత పరిస్ధితి లేదన్నారు.
 కేంద్ర ప్రభుత్వం బి సీ లను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారని మంత్రి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బి సీ ల అభివృద్ది, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కానీ దేశంలో ఆరువై కోట్ల (60) మంది బి సీల సంక్షేమానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టకపోవడం చాలా దుర్మార్గమన్నారు, బి సీ ల పట్ల బి జే పి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఇదేనా అని మంత్రి ప్రశ్నించారు.  
 బి సీ ల అభివృద్ది కి సిఎం కెసిఆర్  రాష్ట్ర రాజదాని లో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ రాజదానిలో తెలంగాణ తరహాలో బి సీల ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని మంత్రి ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. దేశంలో బి సీ ల జనాభ, ఆర్థిక స్థితిగతులను అధ్యాయనం చేసి జనాభ ప్రతిపాదికన నిధులు విడుదల చేయాలన్నారు.  చట్టసభలలో బి సీ లకు  రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర అసేంబ్లీ లో తిర్మానం చేసి డిల్లీకి పంపిస్తే పార్లమెంట్ లో బి సీ ల బిల్లు పెట్టకుండా బి జే పి ప్రభుత్వం బి సీలను రాజకీయంగా ఎదుగుదలను అడ్డుకుంటున్నదని మంత్రి అరోపించారు. చట్ట సభలలో బి సీ రిజర్వేషన్లు ను పేంచాలని మంత్రి డిమాండ్ చేసారు. బి జే పి ప్రభుత్వానికి బి సీ ల అభివృద్ది పై చిత్తశుద్ది లేదన్నారు.

Related Posts