YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జివిఎ వృద్ధి,మరియు ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సిఎస్ సమీక్ష

జివిఎ వృద్ధి,మరియు ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సిఎస్ సమీక్ష

రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలతోపాటు పారిశ్రామిక,మౌళిక రంగాల్లో జివిఎ(గ్రాస్ వాల్యూ ఏడెడ్) వృద్ధి రేటు,హై ఇంపాక్ట్ ప్రాధాన్యతా ప్రాజెక్టులు అంశాలపై సిఎస్  దినేష్ కుమార్ బుధవారం అమరావతి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన జివిఏ వృద్ధిరేటు లక్ష్యాలు,సాధించిన ప్రగతిపై ఆయా శాఖలవారీగా సమీక్షించారు.అన్ని శాఖల్లోను సమాచారం సేకరణ,రిపోర్టింగ్ విధానాలను అన్ని విధాలా మెరుగుపర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ పధకాలు,కార్యక్రమాలు అమలు లక్ష్యాలు,సాధనకు సంబంధించిన ఖచ్చితమైన డేటా బేస్ ను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.జివిఏకు సంబంధించి సాధించాల్సిన లక్ష్యాలపై కొన్ని మైలురాళ్లను నిర్దేశించుకుని ఆప్రకారం నెలవారీ లేదా త్రైమాసికపరంగా సాధించిన ప్రగతిని క్వాలిటేటివ్ గా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.రాష్ట్రంలో పెద్దఎత్తున నిర్మాణ రంగం పనులు జరుగుతున్నందున అందుకు సిమ్మెంట్,ఇనుము వినియోగం జరుగుతోందని రాష్ట్రంలో ఎంతమేరకు సిమ్మెంట్,ఇనుము వినియోగించిందీ ఆయా ఉత్పత్తి కంపెనీల నుండి సమాచారం సేకరించి జివిఏలో ఈరంగాన్ని కూడా లెక్కించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అనంతరం హైఇంపాక్ట్ ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సిఎస్ దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు.రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి సంజయ్ గుప్త జివిఏ మరియు స్టేటస్ ఆఫ్ హైఇంపాక్ట్ ప్రయారిటీ ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ 150కిపైగా జివిఏ పాయింటర్లు ఉన్నాయని 2018-19 ఆర్ధిక సంవత్సరానికి వివిధ శాఖలవారీ నిర్దేశించిన జివిఏ లక్ష్యాలు,సాధన గురించి వివరించారు.అనంతరం హై ఇంపాక్ట్ ప్రయారిటీ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిని వివరిస్తూ ఎనర్జీ ఇన్ప్రాస్ట్రక్టర్ మరియు ఇన్వెస్ట్మెంట్ రంగానికి సంబంధించి ఎకనమిక్ సిటీస్,జక్కంపూడి పుట్ వేర్ సిటీ,భావనపాడు పోర్టు,విజయవాడ విమాశ్రయం విస్తరణ పనుల వివరాలు తెలిపారు.అలాగే ఇన్పర్మేషన్,ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యునికేషన్స్ రంగానికి లాంచ్ ఆఫ్ బ్రాండ్ అమరావతి ప్రాజెక్టు గురించి,పరిశ్రమలు మరియు వాణిజ్య రంగానికి సంబంధించి విశాఖ-చెన్నె,చెన్నె-బెంగుళూర్ పారిశ్రామిక నడవాలు,ఎంఎస్ఎంఇ క్లస్టర్ల అభివృద్ధి ప్రగతిని వివరించారు.అదేవిధంగా రవాణా,రోడ్లు భవనాల రంగానికి సంబంధించి అమరావతి-అనంతపూర్ హైవే,బీచ్ కారిడార్,ఉద్యానవన రంగానికి సంబంధించి కోల్డు స్టోరేజి ఇన్ప్రాస్ట్రక్చర్ మరియు లాజిస్టిక్స్ గురించి వివరించారు. అలాగే వ్యవసాయం,మార్కెటింగ్ మరియు సహకార రంగాలకు సంబంధించి ప్రతిపాదించిన మార్కెట్ యార్డుల ఆధునీకరణ ప్రాజెక్టుల గురించి కార్యదర్శి సంజయ్ గుప్త వివరించారు.అంతకు ముందు మత్స్య మరియు పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆశాఖల్లో సాధించిన ప్రగతిని వివరించారు.వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఆశాఖకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.ఇంకా ఈసమావేశంలో పరిశ్రమలశాఖ కమీషనర్ సిద్ధార్ధ జైన్,మత్స్యశాఖ కమీషనర్ రామశంకర్ నాయక్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts