కాపు జగ్గరాజు పేట రైల్వే గేటు వద్ద రహదారి మూసివేత పై నిరసన తెలుపుతూ, రైల్వే ఏఈ ఎన్, డి ఈ ఎన్ అది కారులతో మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విదంగా డబుల్ అండర్ పాత్ వే నిర్మించాలని చెప్పారు. అప్పటి వరకు ఉన్న గేటుని మూసవేయకుండా చూడాలని కోరారు.కే.ఎన్.ఆర్ మాట్లాడుతూ చుట్టుప్రక్కల 12 గ్రామాల ప్రజల ప్రజాభిప్రాయం తీసుకోకుండా,ట్రాఫిక్ సమస్యలను అంచనా వేయకుండా , ఏకపక్ష నిర్ణయంతో రైల్వే వారు వేసే ఓక్క లైన్ అండర్ పాత్ వే వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని,రెండు లైన్ల అండర్ పాత్ వే వేయాలని బీజేపి పార్టీ తరపున కోరారు . ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ ఇంధ్రసేనా రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతూ సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలతో కలసి బీజేపి జనసేన నేత్రుత్వంలో దర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ గూటూరు .శంకరరావు, 88వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ది దాడి.నూకరాజు , సీనియర్ నాయకులు రైల్వే బోర్డు మెంబరు గోలి.శంకరరావు ,లాయర్ రమనమ్మ తదితరులు పాల్గొన్నారు.