పెందుర్తి నియోజక వర్గం, పరవాడ మండలం ,ముత్యాలమ్మ పాలెం పంచాయతీ సముద్రతీరం లో ఫార్మసీటీ వ్యర్దాలను సముద్రములో విడిచిపెట్టడం వలన తీరంలో చాలా ఎక్కువగా చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.అలాగే ఫార్మా కాలుష్యం వలన మత్స్యకారులకు చర్మ వ్యాధులు మరియు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇటీవల పరవాడ పెద్ద చెరువులో మత్స్య సంపద చనీపోయి నప్పటికీ రామ్కీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వలన స్థానికులు ఇటీవల నిరసన తెలిపిన ప్పటికీ రామ్ కి అధికారులు ఈ సమీప చెరువుల్లో గాని సముద్రంలో గాని మా రసాయన వ్యర్థాల వలన చేపలు మృతి చెందడం లేదని నీతులు వెళ్లబోస్తున్నారు. రామ్ కి పరిశ్రమ సమీప గ్రామస్తులు పలు అనారోగ్యాలకు గురివుతున్న ఇటువంటి కల్లబొల్లి మాటలు చెప్పడం తగదు అని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించే విధంగా రామ్కీ యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే రాంకీ పరిశ్రమను స్తంభింప చేస్తామని హెచ్చరించారు.