YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దర్శిలో పాదయాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే వేణుగోపాల్

 దర్శిలో పాదయాత్ర లో  పాల్గొన్న ఎమ్మెల్యే వేణుగోపాల్

ప్రకాశం జిల్లా దర్శి లో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనాడు ప్రజా సంకల్ప పాద యాత్ర చెసి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా దర్శి  శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానిక గడియారం స్థంభం సెంటర్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి వేణుగోపాల్  మాట్లాడు తూ నేటికీ మన ప్రియతమ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనాడు  ప్రజా సంకల్ప యాత్ర చెసి నేటికీ మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుపు కొంటున్నామని తెలిపారు. నాడు పాద యాత్ర లో ఇచ్చిన హామీలు నేడు కేవలం 18  నెలలు లో 90  శాతం హామీలు నెరవేర్చారని తెలిపారు. అంతే కాకుండా చెప్పనివి కూడా అమలు పరుస్తూ దేశం లోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా పేరు తెచ్చు కొన్నారని గొప్పగా కొనియాడారు. నవరత్నాలు పధకాలు దేశం లోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రవేశ పెట్టె విధంగా ఉన్నాయని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం లో భాగంగా ఈ రోజు రాష్ట్రం లో అన్ని ప్రభుత్వ పాఠశాల లో ఉన్నత మైన సదుపాయాలు తో సర్వాంగ సుందరంగా రూపు దిద్దు కొన్నాయని కొనియాడారు. పాఠశాల లలో తాగు నీరు, ఫాన్స్, లైట్స్, బాత్రూమ్స్, ప్రహరీ గోడ తదితర సదుపాయం లతో కోట్ల  రూపాయలు ఖర్చు పెట్టి  ప్రభుత్వ పాఠశాలలు తయారు చేసారని తెలిపారు.తదుపరి గడియారం స్థంభం సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు వై వి సుబ్బయ్య, అంజిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,   వి సి రెడ్డి, దర్శి సొసైటీ ప్రెసిడెంట్ వేమిరెడ్డి చెన్నారెడ్డి, తూర్పు వెంకటాపురం సొసైటీ ప్రెసిడెంట్ పుల్లారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  ర్యాలీ లో పాల్గొన్నారు.

Related Posts