ప్రభుత్వం చెప్పిన పంటలు వేసి తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. శుక్రవారం అయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాసారు. నియంత్రిత సాగు పంటల్లో భాగంగా 40లక్షల వరిపంట రైతులు వేశారు. 24 లక్షల ఎకరాల్లో బీపీటీ, తెలంగాణ సోనా, జై శ్రీరామ్, హెచ్ఎంటీ వంటి సన్న రకాలు సాగు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నారకాల పంటల కోత ప్రారంభమైంది కానీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదని అయన అన్నారు. సన్నారకాలను ప్రభుత్వం కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, మిల్లర్లు కానీ ఏ ధరకు కొనుగోలు చేయాలో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. కేంద్రం ధాన్యానికి 1888 క్వింటాలుకు మద్దతుదర ప్రకటించింది...అదే ధరకు సన్నాలు కొనుగోలు చేస్తామంటున్నారనిఅయన అన్నారు.
సన్నారకాల కొనుగోళ్ల పై ప్రభుత్వం స్పందనలేకపోవడం పై తెలంగాణ రైతాంగం అతితక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. గతంలో సన్నాలకు మిల్లర్లు 2500 వందలు పెట్టి కొనేవాళ్ళు కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారు. భారీ నష్టాల వల్ల రైతులు తివమైన పంటనష్టానికి గురి అయ్యారు. నియంత్రిత సాగు వల్ల సన్నారకాలకు రైతు ప్రతి ఎకరానికి 20వేలు నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం వెంటనే సన్నారకాల కొనుగోళ్ల పై స్పష్టమైన విధానం కార్యాచరణ ప్రకటించాలి. క్వింటాలకు మద్దతుదర అదనంగా కనీసం 5వందలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అయన లేఖలో పేర్కోన్నారు.