చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమంద గ్రామంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్యక్రమం శుక్రవారం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్
శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఈ విలీన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కె.వెంకటరెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులకు
ఆలయానికి సంబంధించిన రికార్డులను అందించారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వేంకటేశ్వర్లు ఆలయానికి సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను టిటిడి
అధికారులకు అందజేశారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సముదాయంలో ఈ ఆలయాన్ని చేర్చారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జనరల్ డెప్యూటీ ఈవో వరలక్ష్మీ, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ డెప్యూటీ ఈవో విఆర్.శాంతి, ఇన్వెంటరీ డెప్యూటీ ఈవో దేవేంద్రబాబు, సూపరింటెండెంట్
చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు.