YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

చీరాలలో రగులుతున్న ఆధిపత్య పోరు

చీరాలలో రగులుతున్న ఆధిపత్య పోరు

నిన్న గాక మొన్నొచ్చి.. నిన్న గాక మొన్నొచ్చి.. నాట‌కాలా.. అబ్బో చాలా క‌త‌లున్న‌య్ క‌దా. తియ్యండ్రా బండ్లు.. ఎత్తండ్రా జెండాలు.. పీకండ్రా ఫ్లెక్సీలు. ఇదేనండీ.. చీరాల లోక‌ల్ లీడ‌ర్ల మ‌ధ్య ఈ మాత్రం డైలాగులు.. రెగ్యుల‌ర్ గా వినిపిస్తున్న‌వే. అంతా మెంట‌ల్ మెంట‌ల్ యాపారం న‌డుస్తుంది అక్క‌డ‌. ఏ లీడ‌ర్ ఏ కేడ‌ర్ లో ఉన్నాడో.. ఏ లీడ‌ర్ ఏ సైడ్ నుంచి వ‌చ్చి మ‌న సైడ్ నుంచుంటున్నాడో.. తెలీడం లేదంట‌. వేగులు.. గూడచారులు.. మామూలుగా లేదు. క‌త క‌త కాదు. మొన్నీ మ‌ధ్య నుంచి నిప్పు భగ్గు భ‌గ్గుమంటోంది క‌దా. ఇప్పుడు క‌ర‌ణం బ‌ల‌రాం కుమారుడు క‌ర‌ణం వెంక‌టేశ్ ఇంకో అడుగు ముందుకేశారు. మొన్న‌ట్నుంచీ మాట్లాడ‌నిది ఇందుకే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నా.. ఇక‌పై వైలెంటే అంటున్నారు. కార్య‌క‌ర్త‌లు అంద‌రికీ నేరుగా చెప్పేశారు. ఇక‌పై చీరాల మ‌న‌దే అనేలా కామెంట్స్ చేశారు.. జ‌గ‌న్ అన్న నాకు స్వేచ్ఛ ఇచ్చేశారు. ఇన్నాళ్లూ ఒక లెక్క‌.. ఇక‌పై మ‌రో లెక్క‌.. ఆయ‌న కొడుకొచ్చాడు.. ఆయ‌న కొడుకొచ్చాడు అని చెబుతున్నా అంటూ.. డైలాగ్ లు పేల్చేశారు. జ‌గ‌న్ అన్న ఇచ్చిన స్వేచ్ఛ‌తో.. ఇక‌పై ఎలా ఉంటుందో చూడండి అంటూ.. కేడ‌ర్ తో ఈల‌లు కొట్టించారు. ఇండైరెక్ట్ గా ఆమంచి టీమ్ కి వార్నింగ్ ఇచ్చారు. ఆ క్యాడ‌ర్ భ‌ర‌తం ప‌ట్టేద్దాం అనే స్టైల్ లో దంచేశారు డైలాగులు. జంక్ష‌న్ లో నుంచుని.. దుమ్ముదులిపేశారు. అక్టోబర్ 31 రాత్రి చీరాల దద్దరిల్లిపోయింది. ఇద్దరు లీడర్ల కేడర్ మధ్య.. దిమ్మతిరిగే వార్ నడిచింది. మా లీడర్ జిందాబాద్ అంటే.. మా లీడర్ జిందాబాద్ అంటూ.. పోటీ పడి మరీ గొడవపడ్డారు. కర్రలతో దాడులు చేసుకున్నారు.. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. చీరాల రోడ్లపై ఓ మినీ యుద్ధమే జరిగింది. ఈ భీకర ఘర్షణకు అసలేంటి రీజన్? ఆమంచి కృష్ణమోహన్.. కరణం బలరాం.. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఇద్దరిదీ ఒకే పార్టీ.. ఒకే జెండా.. బలమైన కేడర్‌తో.. పటిష్టంగా ఉన్న ఇద్దరు లీడర్లు.. ఆమంచి, కరణం మధ్య పీక్‌కు చేరిన ఆధిపత్య పోరు.. నువ్వా-నేనా అన్న రీతిలో చీరాలలో పరిస్థితులు.ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాల్లేవ్.. పరస్పర విమర్శల్లేవ్. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా.. ఇంకా ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు.. ఇప్పుడు రచ్చకెక్కింది. ఎప్పుడైతే కరణం బలరాం అద్దంకిని వీడి.. చీరాలలో అడుగుపెట్టారో.. అప్పటి నుంచే మొదలైంది ఈ పోరు. అదిప్పుడు.. తీవ్రంగా మారి ఘర్షణలకు దారితీస్తోంది. నెత్తురు చిందేలా చేస్తోందిఆమంచి, కరణం మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో.. స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయ్. ఇది చూసి.. జనం బెంబేలెత్తిపోతున్నారు. నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా.. వర్గపోరుతో రణరంగంగా మారుతోంది. రెండు వర్గాలను అదుపు చేయడం పోలీసులకు సవాల్‌ మారింది. ప్రకాశం జిల్లాలో.. ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే నియోజకవర్గం చీరాల. ఎన్నికలప్పుడే కాదు.. రాజకీయంగానూ చీరాల ఎప్పుడూ కాకమీదుంటుంది. ఆమంచి రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ నియోజకవర్గంపై ఆ ముద్ర పడిపోయింది. ఇప్పుడు.. ఇక్కడికి కరణం బలరాం ఎంటరయ్యారు. దీంతో.. పరిస్థితులన్నీ మారిపోయాయ్.ఈ ఇద్దరు నాయకులు సమఉజ్జీలు కావడం, జనంలో మాస్ లీడర్లన్న పేరు, బలమైన కేడర్ కలిగి ఉండటంతో.. ఎవ్వరూ తగ్గే పరిస్థితి కనిపించదు చీరాలలో. అందుకే.. ఈ ఇద్దరు లీడర్లు స్థానికంగా నిర్వహించే ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. టెంపరేచర్ పెరిగిపోతోంది. టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన కలుగుతోంది.2019లో ఈ ఇద్దరు నాయకులు.. ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు. ఆమంచిపై.. కరణం బలరాం గెలిచారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో.. వైసీపీలో చేరారు కరణం బలరాం. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు రగులుతూనే ఉంది

Related Posts