టీడీపీ వర్సెస్ వైసీపీ. గుడివాడలో రాజకీయం హీటెక్కింది. టీడీపీ కూడా పార్టీని స్ట్రాంగ్ గా చేసేందుకు అన్ని రకాల ఆప్షన్లూ తీసుకుంటోంది. ఏ మాత్రం తగ్గడం లేదు. పార్టీ రాష్ట్ర కమిటీని కూడా ఫిక్స్ చేసింది టీడీపీ. దీంతో.. కొన్ని నియోజకవర్గాలపై ఫుల్ గా ఫోకస్ చేసింది. అందులో ఒకటే గుడివాడ.
గుడివాడ అంటే.. టీడీపీ. టీడీపీ అంటే.. గుడివాడ. అలా ఉండేది గుడివాడ ముఖ చిత్రం. ఎన్టీఆర్ పోటీ చేసిన దగ్గర్నుంచీ.. టీడీపీకి కంచుకోటలా మారింది. కానీ.. ఆ ముఖ చిత్రాన్ని తన ముఖంతో మార్చేశారు కొడాలి నాని. అందుకే.. కొడాలి నానిని అష్ట దిగ్బంధనం చేయాలని ప్లాన్ చేస్తున్నారట టీడీపీ లీడర్లు.
ఇక కొడాలి నాని టీమ్ కూడా దీనిపై బానే రియాక్ట్ అవుతోందంట. బయటికొచ్చి.. ప్రెస్ మీటింగ్ లు గట్రా ఏం పెట్టకపోయినా.. లోలోపల మాత్రం ఫుల్ ఫైట్ నడుస్తోందంట. టీడీపీ కూడా అడుగులు ముందుకేస్తుండడంతో.. వైసీపీ కూడా మూవ్ అవుతోంది. ఇక కొడాలి నానికి సెపరేట్ క్రేజ్ ఉంది.. సెపరేట్ పవర్ ఉంది. సో.. నాని ఏ మాత్రం తగ్గడం లేదట. టీడీపీ వేస్తున్న ఎత్తులన్నీ.. కొడాలి నాని టీమ్ కి ఇమీడియట్ గా తెలిసిపోతున్నాయట. ఎన్ని ఎత్తులేసినా.. అన్నీ చిత్తుచేసే కెపాసిటీ ఉన్న లీడర్ మా నాని అంటూ.. వైసీపీ క్యాడర్ కూడా కాన్ఫిడెంట్ గా ఉంది. నానికి లోకల్ గా బలం ఉంది. పార్టీలో కూడా అధిష్టానం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది.
అదీ కాక.. అధికారంలో ఉన్న పార్టీ. సో.. వాళ్లు కూడా ఇంకాస్త కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఇప్పుడే కాదు.. వచ్చే ఎన్నికలే కాదు.. మరో ఎన్నికలు.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా నానిని బీట్ చేసే సత్తా లేదనేది వైసీపీ క్యాడర్ లో బలంగా ఉన్నా బలం. ఎక్కడ తేల్చుకుందాం.. ఏ డెవలప్ మెంట్ లో తేల్చుకుందాం రండి అంటూ.. అరుగుల మీద కూర్చునే కార్యకర్తలు.. రచ్చబండ ముచ్చట్లలో సవాళ్లు ఫుల్లుగా పెరిగాయట. చూడండి చూడండి ఇంకో ఆర్నెళ్లలో గుడివాడలో మా బలమేంటో చూపిస్తాం అని టీడీపీ వాళ్లు.. ఇంకో ఆర్నెళ్లు కాదు.. ఇంకో దశాబ్దం కూడా ఏం చేయలేరు అని నాని బ్యాచ్. అంతా సవాళ్లతో హీటెక్కిందట.