YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

కరోనా ధర్డ్... ఫోర్త్ కూడానా...

కరోనా ధర్డ్... ఫోర్త్ కూడానా...

కరోనా వైరస్ భారత్ ను ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. అనేక రాష్ట్రాలు ఇప్పటికీ కరోనాతో అల్లాడిపోతున్నాయి. కొంచెం తగ్గినట్లు కన్పించి మళ్లీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కేరళ, ఢిల్లీ
వంటి రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆందోళన కల్గించే అంశమే. రానున్న కాలంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
కూడా హెచ్చరికలు రాష్ట్రాలకు జారీ చేస్తుంది.దేశ రాజధాని ఢిల్లీని తీసుకుంటే కొంత తగ్గుముఖం పట్టాయని అనుకుంటున్న తరుణంలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఐదువేలకు పైగా కేసులు
రోజుకు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. అయితే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఢిల్లీలో థర్డ్ వేవ్ కరోనా గా చెబుతోంది. అయితే మరణాల సంఖ్య గతంలో కంటే తక్కువగా ఉంటుందని నిపుణులు
చెబుతున్న మాట కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరుకున్నాయి. మరణాలు ఏడువేలకు దగ్గరలో ఉన్నాయి. ఢిల్లీలో సెకండ్ వేవ్
వచ్చి వెళ్లిందన్నది వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న అంశం. మూడో విడత కరోనా ఇప్పుడు ఉందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మరింత వైరస్ విజృంభించే అవకాశాలున్నాయని
హెచ్చరిస్తున్నారు. అయినా ప్రజలు మాత్రం ఇంకా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని అంటున్నారు.కేరళలో సయితం కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కేరళలో తొలి కేసు
నమోదయినా దానిని నియంత్రించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత మళ్లీ కేసుల సంఖ్య తీవ్రమయింది. రోజుకు 9 వేల కేసులు కూడా
నమోదయ్యాయి. మొత్తం 2.20 లక్షల మంది కేరళలో కరోనా బారిన పడ్డారు. ఈరెండు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా విజృంభించే అవకాశాలున్నాయంటున్నారు. నాలుగో దశ కూడా ఉంటుందని వైద్య
నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రజలు అప్రమత్తంగా ఉండటమే ఏకైక మార్గమని చెబుతున్నారు.

Related Posts