YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం తెలంగాణ

ఆక్సిజన్ సిలెండర్లు ఎప్పుడు

ఆక్సిజన్ సిలెండర్లు ఎప్పుడు

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండంతో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కార్‌ నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిని ఎంచుకుంది. ఇక్కడ 100 పడకలతో కూడిన ప్రత్యేక ఆక్సిజన్‌ వార్డును ఏర్పాటు చేసింది. ఆక్సిజన్‌ సరఫరాకు పైప్‌లైన్‌ కూడా అందుబాటులోకి తెచ్చారు. కానీ ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటు చేయకపోవడంతో పాత వాటితోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.కొవిడ్‌-19 అనుమానితులకు మెరుగైన చికిత్స అందించేందుకు నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా (పైప్‌లైన్‌)తో కూడిన ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు సర్కార్‌ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. వారం రోజుల్లో పనులు పూర్తి చేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ (వైద్య ఆరోగ్యశాఖ) అధికారులు ఆస్పత్రిని సందర్శించి 2,3, వార్డులను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేందుకు అనుకూలంగా ఉన్నట్టు నిర్దారించారు. నగరంలో కొవిడ్‌ కేసులు వెలుగులోకి రావడంతో ఫీవర్‌ ఆస్పత్రిలోని 7వ వార్డును ఐసోలేషన్‌ వార్డుగా మార్చారు. అనంతరం అనుమానితుల తాకిడి పెరగడంతో 8వ వార్డును కూడా ఐసోలేషన్‌ వార్డుగా మార్చారు. అయితే ఆయా వార్డులు దశాబ్దాల క్రితం నిర్మించిన రేకుల షెడ్స్‌ కావడంతో అందులో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి తగ్గకపోవడంతో ఆస్పత్రిలోని ఇన్‌ పేషెంట్ల వార్డులన్నీ ఖాళీగా మారాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోని 2,3,4 వార్డులను 100 పడకల ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడంతో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు మే 3వ తేదీన ఆస్పత్రిని సందర్శించారు. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు 4వ తేదీన ఎస్టిమేషన్‌ ఇవాల్సి ఉండగా వీలే పడలేదు. మరుసటి రోజు ఎస్టిమేషన్‌ ఇచ్చారు. కాగా 2,3,4 వార్డుల్లోని రోగులకు నేరుగా ఆక్సిజన్‌ అందించేందుకు ప్రత్యక పైపులైన్‌ కూడా ఏర్పాటు చేశారు. దీంతో కొవిడ్‌ సెంటర్‌ అందుబాటులోకి రాగా 45 రోజుల క్రితం ఆక్సిజన్‌ వార్డును ఆస్పత్రికి అప్పగించారు. 100 పడకలకుగాను 2 ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వార్డుల్లో ఉండే రోగులకు ఆక్సిజన్‌ అందంచడానికి సిలిండర్లను అమర్చులేదు. అక్సిజన్‌ వార్డు అందుబాటులోకి వచ్చి నెల గడుస్తున్నా ఏర్పాటు చేయకపోవడంతో పాత సిలిండర్లతోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అనే విషయంపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ లేదు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సిలిండర్ల ఏర్పాటును పూర్తిగా విస్మరించింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుఖం పట్టాయి. ఆస్పత్రి కరోనా రోగుల సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. మరికొద్ది రోజుల్లో కొవిడ్‌-19 అందుబాటులోకి వస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ కూడా స్పష్టం చేసింది. దీంతో కరోనా తగ్గిన తర్వాత సిలిండర్లు ఏర్పాటు చేస్తారా? ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏమైనా అత్యవసరమైన పరిస్థితుల్లో అక్సిజన్‌ అవసరమైతే, పాత సిలిండర్లలో ఏమైనా సమస్యలు ఏర్పడితే పరిస్థితి ఏంటి అని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కొత్త సిలిండర్లు అ మర్చాలని రోగులు కోరుతున్నారు.

Related Posts