YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రెండో కాపురం పెట్టిన భర్తను పట్టుకున్న భార్య

రెండో కాపురం పెట్టిన భర్తను పట్టుకున్న భార్య

భార్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రియురాలితో కాలం గడుపుతున్న భర్త ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకుందో వివాహిత. తిరుపతి పట్టణంలో ఈ ఘటన జరిగింది.  చిత్తూరులో న్యాయవాదిగా వున్న  చంద్రమౌళికి కవిత తో వివాహమయింది. అయినా, భార్యని కాదని చంద్రమౌళి  ప్రియురాలితో కాపురం పెట్టాడు. తిరుపతి పద్మావతి నగర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. విషయం  తెలిసిన భార్య కవిత భర్తను పట్టుకుంది.  కవిత వచ్చిన విషయం తెలిసిన చంద్రమౌళి కిటికి నుంచి దిగి గోడ దూకి పారిపోయాడు. బంధువులతో ఇంట్లోకి వచ్చిన కవితకు అక్కడ తన భర్త  దుస్తులు, ఇతర వస్తువులను గుర్తించింది. దాంతో కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బు ఆశ చూపి అనేకమంది మహిళలతో  చంద్రమౌళికి అక్రమ సంబంధాలు వున్నాయని కవిత  ఆరోపించింది. గతంలో కాల్ మని కేసులో చంద్రమౌళి  అరెస్ట్ అయిన విషయం కుడా పోలీసులకు వివరించింది.

Related Posts