YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మండిపాటు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి  మండిపాటు

హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో జరుగుతున్న దేవాదుల ప్రాజెక్టు రివ్యూ మీటింగ్ లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. శనివారం నాడు హన్మకొండ లోని హరితా హోటల్ లో దేవాదుల ఎత్తిపోతల పథకం పై మంత్రులు ఎర్రబెల్లి దయకర్ రవు, సత్యవతి రాథోడ్ లు రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, కలెక్టర్లు,  సిఎం  కార్యాలయ సెక్రెటరీ స్మితా సబర్వాల్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్ లు  ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. రివ్యూ క్రమంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ పనులు  జాప్యం చేస్తున్నారు. బాద్యతా రాహిత్యంగా  వున్నారని  దేవాదుల  చీఫ్ ఇంజనీర్, ఎస్ఈ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంత్రి దయాకరరావు వారించినా వినకుండా అధికారులపై  ఊగిపోయారు. జనగామ జిల్లాలో కలెక్టర్ ను కలిసి నీళ్ల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తుంటే, అధికారులు సహకరించడం లేదు. దేవాదుల ప్రాజెక్టు సి ఈ కనీసం పరిశీలించకుండా సమస్యను జఠిలం చేస్తున్నారన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి లు కూడా అసహనంగా ఉన్నారనీ అయన అన్నారు.  అధికారుల నిర్లక్ష్యం వలన మా ఎమ్మెల్యేల మధ్య గొడవలు అవుతున్నాయంటూ ముత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి జోక్యం చేసుకోని పనులు అనుకున్న సమయంలో పూర్తిచేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.

Related Posts