YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అప్పజెబుతారా ? లేక మమ్మల్ని గృహప్రవేశాలు చేయించమంటారా ??

 టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అప్పజెబుతారా ? లేక మమ్మల్ని గృహప్రవేశాలు చేయించమంటారా ??

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్లు నిర్మించారు కొంత మంది దగ్గర మున్సిపాలిటీ వారు 25000 నుండి 1,00000 వరకు డిడి ద్వారా డబ్బులు కట్టించుకుని ఆన్ లైన్ ద్వారా లాటరీ పద్ధతిలో లబ్దిదారులకు ఇంటి నెంబర్స్ తో పాటు గృహాలు మంజూరు అయినట్టు ఉత్తర్వులు జారీ చేశారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ మీద పార్టీ నాయకుల మీద కక్షతో గృహ లబ్ది పొందిన లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారు సొంత ఇంటి కల కోసం అప్పులు చేసి వొంటి మీద ఉన్న బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి డబ్బులు చెల్లించారు ఇటు ఇళ్లు రాక అటు అప్పు చేసిన దానికి వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు శ్రీ కె.అచ్చెన్నాయుడు పిలుపు మేరకు, నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గాలి భానుప్రకాష్* గారి ఆదేశాల మేరకు  "నా ఇళ్లు - నా సొంతం " అనే నినాదంతో పుత్తూరు పట్టణ మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పుత్తూరు మున్సిపాలిటీ  17వ వార్డు వినాయకపురం వద్ద నిర్మించిన టిడ్కో గృహల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పుత్తూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు జీవరత్నం నాయుడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వెంటనే స్పందించి మంజూరు చేసిన ఇళ్ళను పేదవారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొండి వైఖరితో ఇలాగే కొనసాగితే లబ్ది పొందిన పేదవారితో గృహ ప్రవేశాలు చేయించి వారికి కేటాయించిన ఇళ్ళల్లో దింపుతాం అని కూడా హెచ్చరించారు. అతి త్వరలో లబ్దిదారులతో కలిసి నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్  ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నామని టీడీపీ నాయకులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పుత్తూరు మాజీ ఎంపీపీ గంజి మాధవయ్య, పుత్తూరు మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ బి.ఆర్.యుగంధర్, టీఎన్టీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి మాధవుల నాయుడు, పుత్తూరు మండల టీడీపీ అధ్యక్షులు కరుణా యాదవ్, మాజీ కౌన్సిలర్లు బండ్ల భాస్కర్, వి.ఎం.గోపి, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు శరవణ, టీడీపీ నాయకులు బాలిరెడ్డి, ఏలుమలై రెడ్డి, సంతోష్, ధనపాల్, అశోక్, డి.జి.ధనపాల్, రమేష్, ఈశ్వర్ యాదవ్, హేమాద్రి, కరీమ్ బాషా, వేలు, అన్బు, సుబ్బు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Related Posts