YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు దేశీయం

4.4 కోట్ల రేషన్ కార్డులను రద్దు

4.4 కోట్ల రేషన్ కార్డులను రద్దు

ఆధార్ తో అనుసంధానం చేయని సుమారు 4.4 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.. రేషన్ కార్డుల్లో అక్రమాలు వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయాలన్న నిబంధన విధించింది. రేషన్ కార్డుల ముసుగుతో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ అందడం లేదు. కొందరు దళారులు తప్పుడు  డాక్యుమెంట్లతో రేషన్ కార్డులను సృష్టించి రేషన్ బియ్యం - సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రూ. వేలకోట్ల నష్టం వస్తున్నది. ఇటువంటి అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తున్నది. మరోవైపు ఆధార్ కార్డు - పాన్ కార్డు మాదిరిగా రేషన్ కార్డు కూడా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఉండటమే ఒక అర్హతగా పరిగణిస్తారు.  దీంతో కొందరు తప్పుడు ధ్రువపత్రాలతో రేషన్ కార్డును పొంది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి తీసుకున్న 4.4 కోట్ల రేషన్ కార్డులను మోదీ సర్కార్ రద్దు చేసింది. ‘2013కు ముందు చాలా బోగస్ కార్డులు - డూప్లికేట్ కార్డులు ఉన్నాయి. గత ఏడేళ్ల కాలంలో రేషన్ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలని నిర్ణయించుకున్నాం. డూప్లికేట్ కార్డులను గుర్తిస్తూ వచ్చాం. అలాగే చనిపోయిన వారి కార్డులను తీసేశాం. ఆధార్ కార్డుతో అనుసంధానం కాని కార్డులు కూడా పనిచేయవు’ అని ఆహార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Related Posts