ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గంలోని ప్రాంతాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకోవడానికి శనివారం 18 వ డివిజన్ లోని బాప్టిస్ట్ పేట, వంగాయగూడెం, గొల్లగూడెం, పలు ప్రాంతాలను పాదయాత్ర చేసే ప్రజల ఎవరి క్షేమాలను మరియు వారి సమస్యలను కూలంకశంగా విన్నారు. ప్రాంత వాసుల సమస్యలను తెలుసుకున్న అనంతరం సంబంధిత అధికారులకు ఆ ప్రాంతపు సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించి ప్రజలకు తప్పకుండా సమస్యలకు పరిష్కారం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.