రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతి పక్ష హోదాలో ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం లో దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ పాదయాత్ర చేపట్టారు.ఈ సందర్బంగా మద్దిశెట్టి వేణుగోపాల్ కు గ్రామ ప్రజలు
ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా బస్టాండ్ సెంటర్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదుపరి అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. ఇంటింటి కి వెళ్లి అయన ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అభివాదం చేసుకుంటూ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను పాలన ప్రారంభించిన 17 నెలల కాలంలో అమలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు పట్టిపీడిస్తున్నా ప్రజా సంక్షేమం కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తున్నారని కొనియాడారు. రాష్ట్రాన్ని సర్వతో ముఖాబివృద్ది దిశగా అడుగులు వేయిస్తున్నారని కొనియాడారు. ప్రజా ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.