ప్రకాశం జిల్లా కనిగిరిలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నా ఇల్లు నా సొంతం - నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా తెలుగు దేశం పార్టీ కార్యాలయం నుంచి లబ్ధిదారులతో కలసి చాకిరాల వద్ద గత టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల అపార్ట్ మెంట్ వద్దకు చేరుకున్నారు. లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల అపార్ట్ మెంట్ ప్రాంగణంలోకి వెళ్లకుండా లబ్ధిదారులను, టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వివాదం జరిగింది. లబ్ధిదారులు అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. ఇంటి నిర్మాణం చేపట్టడం ప్రతి ఒక్కరి కల అని పేదల కోసం నిర్మిచిన 917 గ్రహాలను పేదలకు దక్కకుండా చేసి వారి కలను దూరం చేసారని ఆరోపించారు. అప్పు చేసి ఇక్కడ ఇల్లు తీసుకుంటే ప్రభుత్వం ఇంకా ఇవ్వకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, టీడీపీ నాయకులు బెజవాడ బీబీజాన్, నాగలక్ష్మి, వరలక్ష్మి, విజయలక్ష్మి, నాగమణి, శ్రావణి, ముంతాజ్, బేగం, ఖాజాబి, షకీలా, రిహాన, ఖాజావలి, నాయబ్ రసూల్, యస్దాని, సుబ్బారావు, మురళీధర్, టీడీపీ నాయకులు
వివిఆర్ మనోహార్ రావు, బేరి పుల్లారెడ్డి, రాచమల్ల శ్రీనివాసులురెడ్డి
షేక్ బుజ్జా, దొడ్డ వెంకట సుబ్బారెడ్డి, తమ్మనేని వెంకటరెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, ఇంద్రభూపాల్, ముత్తురెడ్డి వెంకట రెడ్డి, కర్నాటి భాస్కర్,బారాఇమాం, చిన్న శ్రీను, బ్రమ్మం గౌడ్, షేక్ జంషీర్ అహమ్మద్, షేక్ ఫిరోజ్, యల్ వి ఆర్, అచ్చాల రవి, శ్రీరాం, బ్రమ్మం, షేక్ నజీముద్దీన్, సురేంద్ర, ముంగమూరి శ్రీను, బొగ్గవరపు శ్రీను, యువరాజ్, మధు, ఫారూఖ్, మాలి, సుభాష్ చంద్ర బోస్, పెన్నా కొండలు, నరసింహా, షడ్రక్, గౌస్, తమ్మనేని భాస్కర్, రహిమాన్, అహమ్మద్, సత్తి, రాజా, మహమ్మద్ అలీ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.