YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

సమస్యలు లేని గ్రామంగా అబివృద్ది చేస్తాం - ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

సమస్యలు లేని గ్రామంగా అబివృద్ది చేస్తాం - ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సమస్యలు లేని గ్రామంగా అబివృద్ది చేస్తామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని  పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలతో  నాడు ప్రజల కోసం నేడు  కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి  మండల పరిధిలోని సూగూరు  గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అడుగుపెట్టిన బాలనాగిరెడ్డి  కి గ్రామ వైసిపి నాయకులు కార్యకర్తలు గజమాలలు , పూలమాలవేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యంఎల్ఏ.గ్రామ నాయకులకులతో కలసి గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న చేయుత ,జగనన్న చేదోడు ,జగనన్న భరోసా వృద్ధాప్య పింఛను అమ్మ వడి లాంటి పథకాలు అందరికీ  అందుతున్నాయా  అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఎలాంటి పథకాలు అయినా రాలేకపోతే గ్రామం వాలంటరీలు కానీ సచివాలయ సిబ్బంది ద్వారా మా దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. గ్రామంలోని పలువురు మహిళలు వృద్ధులు మాకు పథకాలు అందలేదని వారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అక్కడ ఉన్న గ్రామ వాలంటరీ సచివాలయం సిబ్బందిని పథకాల వచ్చేలా చూడండి అని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలో తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని కాలువలు , సిసి రోడ్లు  కూడా మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ జగనన్న చెప్పిన  నవరత్నాలు అందరికీ  అందుతాయని ప్రతి ఒక్కరు  సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. మంత్రాలయం మండలం లోని అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన సూగూరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంటింటికీ కొళాయి కూడా ఇస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని ప్రజలనుద్దేశించి మాట్లాడారు .అలాగే మీ గ్రామం శివారు మీదుగా ఆర్డీయస్  కాలువ ఏర్పాటు చేస్తామని దీంతో సూగూరు గ్రామంలో కూడా పంట పొలాలు పుష్కలంగా పండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో   వైకాపా మండల కన్వీనర్  భీమిరెడ్డి, మండల వైసిపి నాయకులు కరణం గోపాలరావు స్వామి,  ఓంకార్ రెడ్డి, విజయేంద్ర రెడ్డి నాగిరెడ్డి ,గ్రామ వైసిపి నాయకులు లక్ష్మయ్య, లక్ష్మిరెడ్డి, దేవదాసు, జెసిబి వెంకటేశ్ , మాజీ ఎంపిటిసి హనుమంతు, గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటరీ లు పాల్గొన్నారు.

Related Posts