YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

డుంబ్రిగుడలో వెయ్యి కేజీల గంజాయి పట్టివేత

డుంబ్రిగుడలో వెయ్యి కేజీల గంజాయి పట్టివేత

అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడయ్యా అందించిన వివరాలు ప్రకారం డుంబ్రిగుడ మండల కేంద్రంలో కస్తూరిబా పాఠశాల రోడ్డు సమీపంలో ఉదయం డుంబ్రిగుడ మండల పోలీసులు ఏ.ఎస్.ఐ సింహాచలం ఆధ్వర్యంలో  తనిఖీలు చేపడుతుండగా గుంటసీమ వైపు నుండి 1000 కేజీల గంజాయి లోడుతో 15 మంది తెల్లటి బొలోరో వ్యాన్ లో రావడం గమనించి ఆపడంతో వ్యాన్ లో ఉన్న15 మంది పారిపోవడానికి ప్రయత్నించారు.దీనితో వారిని ఏ. ఎస్. ఐ సింహాచలం పోలీసుల సహాయంతో పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు వరకు ఉంటుందని వీరందరూ ఒడిసా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించి, ఈ గంజాయి సౌకరు బురిడీ.కృష్ణరావు బుడ్డంగి గ్రామస్తుడుగా గుర్తించారు. అయితే ఇతను పరారీలో ఉన్నట్లు తెలిపారు.మిగిలిన 15 మందిని పట్టుకొని కేసు దర్యాప్తు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు.

Related Posts