YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విద్యుత్ బస్సుల ప్రయోగం

విద్యుత్ బస్సుల ప్రయోగం

కాలుష్య నియంత్రణ లో భాగంగా  తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు మధ్య  స్మోక్ లెస్ ఎలక్ట్రికల్ బస్సులను  ప్రయోగాత్మకంగా ఈరోజు ఆర్టీసీ అధికారులు  పరిశీలన చేశారు. ఆర్టీసీ కేంద్ర విభాగం ఆదేశాలతో మేరకు ఈ ఎలక్ట్రికల్ బస్సులను ఉపయోగంగా గత రెండు రోజుల గా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ లో మధ్య  నడుపుతున్నారు. ఎత్తైన కొండల నడుమ మెట్ట ప్రాంతాలలో ఈ వాహనాల సామర్ధ్యాన్ని  అంచనా వేసేందుకు  ప్రయోగాత్మక పరిశీలన చేస్తున్నామని తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి   తెలిపారు, ఈ ప్రయోగాత్మక పరిశీలన  విజయవంతంగా నడపగలిగినట్లైతే భవిష్యత్తులో మరిన్ని వాహనాలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే  బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ భాగస్వామ్యంతో బస్సులను ఆధునీకరించి ప్రత్యేకంగా రూపొందించారని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి  రెండు వాహనాలను తిరుమల-తిరుపతి మధ్య నడుపుతున్నట్లు చెంగల్రాయులు తెలిపారు.మూడు రోజులపాటు జరిగే ట్రయిల్ రన్ విజయవంతమైనట్లయితే త్వరలో తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు మధ్య డీజిల్ బస్సులు పొగలు చిమ్ముతూ కాలుష్యానికి కారణమవుతున్న పాత తరం బస్సులకు స్వస్తి పలికి, పొగ లేని  బస్సులలో  ప్రయాణికులు ప్రయాణిచేందుకు వీలుంటుంది.

Related Posts