YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కామాఖ్య ఆలయానికి 20 లక్షల విరాళం

కామాఖ్య ఆలయానికి  20 లక్షల విరాళం

అసోంలోని కామాఖ్యదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ జగన్మాత ఇక్కడ కామాఖ్య దేవిగా పూజలందుకుంటోంది. నీలాచల కొండల్లో కొలువున్న ఈ అమ్మవారిని దర్శించుకోడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. తాజాగా, ఈ ఆలయానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు భారీ ఎత్తున బంగారం విరాళంగా అందజేశారు. ఆలయ గోపుర కలశాల తయారీ కోసం ఏకంగా 19 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ బంగారంతో మూడు గోపుర కలశాలను రూపొందిస్తున్నట్టు కామాఖ్య ఆలయ వర్గాలు వెల్లడించాయి.కలశాల కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు అంబానీ దంపతులు కామాఖ్య ఆలయ వర్గాలకు మూడు నెలల కిందటే సమాచారం అందించారు. బంగారు తాపడానికయ్యే ఖర్చులను తాము భరిస్తామని చెప్పారు. హామీ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరఫున బంగారం అందజేయడంతో కలశాల తయారీ పనులు ప్రారంభమయ్యాయి.కలశాల తయారీ కార్యక్రమంలో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. ఇవి పూర్తయిన తర్వాత ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. దేశంలోని శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయం అసోంలోని నీలాచల కొండల్లో కొలువై ఉంది. ఇక్కడికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.‘కోవిడ్-19 కట్టిడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా మూసివేసిన ఈ ఆలయాన్ని ఇటీవలే తెరిచాం. ఇప్పుడిప్పుడు భక్తులు రాక పెరుగుతోంది.. స్వర్ణ కలశాలు పూర్తయితే అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతుంది’ అని కామాఖ్య ఆలయ పాలక మండలి ఛైర్మన్ మోహిత్ చంద్ర శర్మ అననారు.సతీదేవి ఆత్మాహుతి చేసుకుని మరణించిన తరువాత విష్ణువు ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు ఈ భూమిపై అనేక చోట్ల పడ్డాయి. అమ్మవారి యోని భాగం ఇక్కడ పడింది. అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం, కామాఖ్య దేవాలయం అని పిలుస్తారు. పరమశివుడు ఇక్కడ శక్తి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. అలాగే ఈ ఆలయానికి సమీపంలో ఒక భైరవ ఆలయం కూడా ఉంటుంది

Related Posts