YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాపులకు ముందే దీపావళి

కాపులకు ముందే దీపావళి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాంలోనూ సంక్షేమాన్ని వదలం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్న పథకాలను ప్రారంభించారు. తాజాగా, అర్హత ఉండి పథకాలు పొందలేకపోయిన వారికి గుర్తించి వారికి కూడా డబ్బు అందజేశారు. శనివారం ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజాతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రారంభించారు.కాపు నేస్తం పథకం కింద అర్హులైనా కూడా కొందరికి ఆర్థిక ప్రయోజనం చేకూరలేదు. దీంతో వారందరినీ మరోసారి గుర్తించి వారికి కూడా పథకాన్ని అమలు చేశారు. కొత్తగా చేరిన లబ్ధిదారులకు కాపు నేస్తం పథకం కింద ఏపీ ప్రభుత్వం రూ. 142.82 కోట్లు నిధులు విడుదల చేసింది. శనివారం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, జక్కంపూడి రాజా ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ.. అర్హులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాపు నేస్తం పథకం ద్వారా కాపుల్లో వెనుకబడిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.గతంలో కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే కేసులు పెట్టి కాపు ఉద్యమకారులను చంద్రబాబునాయుడు జైళ్లలోకి నెట్టారని మంత్రి వేణుగోపాల్ విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ పేదరికంలో మగ్గిపోకూడదని సంక్షేమ పథకాల సంస్కరణలను సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కాపు నేస్తం పథకం అమలయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కాపులను బీసీల్లో చేరుస్తామని సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు కాపులను మోసం చేశారని, ఆచరణ సాధ్యం కాని హామీలను నాడు జగన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. కేవలం స్వార్థం కోసమే చంద్రబాబు పథకాలను అమలు చేశారని విమర్శించారు.జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. కాపులకు రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు విస్మరించారని, అమలు చేయమంటే కేసులు పెట్టి జైళ్లలో పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా కాపుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన తెలిపారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 24న తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించారు. కాపు మహిళలకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం అందిస్తుంది.

Related Posts