YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోర్టు ఆదేశాలు పట్టించుకోని జగన్

 కోర్టు ఆదేశాలు పట్టించుకోని జగన్

మాజీ ఎంపీ, తెలుగు దేశం పార్టీ నేత సబ్బం హరికి వైసీపీ ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. విశాఖపట్నంలో రిజర్వు ఓపెన్ స్పేస్‌లో భవనాలు నిర్మించారని, 3 రోజుల్లోపు వాటిని తొలగించాలని జీవీఎంసీ అధికారులు నోటీసులిచ్చారు. అయితే నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు సోమవారం వరకు స్టే విధించింది.అయితే దీనిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వరుస ట్వీట్లు చేశారు. ‘‘అధికారంలో ఉన్నవాళ్లు ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రీపగలూ ఆలోచిస్తారు. అధికార యంత్రాంగాన్ని కూడా ఆ దిశగా ఉత్తేజపరుస్తారు. కానీ వైసీపీ పాలకుల తీరు వేరు. ప్రతిపక్ష నేతలపై కక్ష ఎలా తీర్చుకోవాలన్న ఆలోచనలతో రాత్రిళ్ళు నిద్రకూడా పోతున్నట్టు లేదు.ఇందుకు నిదర్శనమే అర్ధరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులు ఇవన్నీ. మాజీ ఎంపీ సబ్బం హరి గారి స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలపై హై కోర్టు సోమవారం వరకు స్టేటస్ కో విధించింది. కానీ ఈ లోపే 3 రోజుల్లో భవనాలను తొలగించాలని ప్రభుత్వం మరో నోటీసును పంపించింది.ఆ నోటీసును కూడా రాత్రివేళ ఇంటికి అంటించి పోయారు. కక్ష రాజకీయాల కోసం పాలనా యంత్రాగాన్ని, వ్యవస్థలను భ్రష్టుపట్టించడం రాష్ట్రానికి చేటు తెస్తుంది. న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై ఈ రకంగా స్పందించడం వెనుక వేధింపు లక్ష్యంగా కనిపిస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.’’ అని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

Related Posts