YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మీ ఎమ్మెల్యేలే మాతో టచ్‌లో ఉన్నారు’ విజయ సాయిరెడ్డికి మంత్రి కాలువ కౌంటర్

 మీ ఎమ్మెల్యేలే మాతో టచ్‌లో ఉన్నారు’      విజయ సాయిరెడ్డికి మంత్రి కాలువ కౌంటర్

 వైసీపీ నేత, రాజసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కాల్వ శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్ వైఖరి నచ్చక పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ పార్టీలో చేరిన విషయాన్ని విజయ సాయిరెడ్డి గుర్తుకు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీతో టచ్‌లో ఉన్నారని, ఈ విషయాన్ని విజయ సాయిరెడ్డి తెలుసుకుంటే మంచిదని అన్నారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి ఎంతమంది పోటీ చేస్తారో తెలుసుకుంటే విజయ సాయిరెడ్డికి వైసీపీ పరిస్థితి అర్థమవుతుందని అన్నారు.

Related Posts