YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

దేశంలో మహిళలు,దళితులపై పెరుగుతున్నఅత్యాచారాలు, దాడులు - ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

దేశంలో మహిళలు,దళితులపై పెరుగుతున్నఅత్యాచారాలు, దాడులు - ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

దేశంలో మహిళలపైనా, దళితులపైన రోజు రోజుకు అత్యాచారాలు, దాడులు, హత్యలు పెడిగిపోతున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. దళితులు,మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష వైఖరికి నిరసనగా ఇందిరా పార్కు వద్ద ప్రారంభమైన మహా ధర్నా.లో పాల్గొని ప్రసంగించారు.త్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన  ఘటన అమానవీయం.. దేశం తలవంచుకుందని  అత్యాచారం చేసి, నాలుక కోసి, వెన్ను విరిచి హత్య చేశారన్నారు.బీజేపీ ప్రభుత్వ వైఖరి దళితులు, మహిళల పట్ల దారుణంగా ఉంది.యూపీ సీఎం యోగి బాధిత కుటుంబాన్ని అవమానించారు. కనీసం సానుభూతి చూపలేదని విమర్శించారు.ట్రంప్ ఆరోగ్య విషయం పరామర్శించి బాగుండాలని కోరుకున్న మోడీ బాధిత కుటుంబాన్ని మాత్రం పరామర్శించలేదని ఎద్దేవా చేసారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు.తెలంగాణలో దళితులు, గిరిజనులు, మహిళకు ఎక్కువ అన్యాయం జరుగుతోంది.మాదిగలకు కనీసం మంత్రివర్గంలో చోటివ్వలేదు. కేసీఆర్ తన సామాజిక వర్గానికి 6 శాఖలు ఇచ్చుకున్నారు.సరనా లో పాల్గొన్న మాజీమంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ మహిళల పై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయని కాని ప్రభుత్వాలు స్పందించడంలేదన్నారు.అసెంబ్లీలో దళిత సమస్యల పై పోరాడేందుకు ఈశ్వరీ భాయ్ లాంటి నేత కావాలన్నారు.కాంగ్రెస్ లోనే దళితులకు న్యాయం జరుగుతుంది.మోదరం సంజీవయ్యను సీఎం చేసింది.ఎక్కడో చదువుకుంటున్న నన్ను ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది కాంగ్రెస్.కాంగ్రెస్ దళితుల కోసం సబ్ ప్లాన్ తెస్తే.. కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేశారు.మాల, మాదిగ అంత సంఘటితమై కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి.హత్రాస్ లో రాహుల్, ప్రియాంక ల పట్ల యూపీ పోలీస్ లు అవమాన వీయంగా వ్యవహరించారు.అన్ని వర్గాల సమస్యలు పోవాలంటే కాంగ్రెస్ మళ్ళీ రావాలి. ఈ కార్యక్రమం లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అధ్యక్షతన.. మహిళ కాంగ్రెస్ చైర్మన్ నెరేళ్ల శారదా, ఎస్సి సెల్ చైర్మన్ ప్రీతం పెద్దఎత్తున పాల్గొన్న మహిళలు, దళితులు..పాల్గొన్నారు.

Related Posts