YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం విదేశీయం

కమల... హిస్టరీ క్రియేటర్

కమల... హిస్టరీ క్రియేటర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త చరిత్ర మొదలయ్యింది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ నుంచి ఉపాధ్యక్షరాలిగా కమలా హ్యారిస్ ఎన్నికయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ చరిత్రను లిఖించారు. అంతేకాదు, ఉపాధ్యక్ష పదవి చేపట్టనున్న తొలి నల్లజాతీయురాలు కూడా కమలే కావడం విశేషం. కమలా హ్యారిస్ తల్లి భారత సంతతికి చెందినవారు కాగా.. తండ్రి జమైకన్. ఏడేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి పెంపకంలోనే పెరిగారు. చిన్నతనంలోనే జాత్యాంహకార అవమానాలను ఎదుర్కొన్న కమల.. అప్పటి అనుభవాలను తన ఆత్మకథలో రాసుకున్నారు.సెలవుల్లో తండ్రివద్దకు వెళ్లినప్పుడు ఇరుగుపొరుగువారు నల్లజాతీయులుగానే చూశారు.. శ్వేతజాతి పిల్లలు ఆడుకోవడానికి రానీయ లేదు. మేము ఉంటున్న దేశం నన్ను, చెల్లెలు మాయాను నల్లజాతి బాలికలులాగానే చూస్తుందన్న విషయం మా అమ్మకు అర్థమయింది. అందుకే ఆత్మవిశ్వాసంతో గర్వించే నల్లజాతి మహిళలుగా మమ్మల్ని తీర్చిదిద్దాలని ఆమె నిర్ణయించుకొంది’ అని తన ఆత్మకథ ‘ద ట్రూత్‌ వియ్‌ హోల్డ్‌’లో కమల రాసుకున్నారు.చిన్నతనంలో అక్కచెల్లెల్లు ఇద్దరూ నల్లజాతీయుల చర్చిలకు వెళ్లి పాటలు పాడేవారు. తల్లి శ్యామల పురాణ కథలను వినిపించేవారు. మద్రాసులోని తండ్రి పి.వి.గోపాలన్‌ ఇంటికి తీసుకెళ్లి తన మూలాలనూ కుటుంబ అనుబంధాలను గుర్తు చేశారు. చదువుల్లో రాణించిన కమల.. ఆఫ్రికన్‌-అమెరికన్‌ సంతతి విద్యార్థులు ఎక్కువగా చదివే హొవార్డ్‌ యూనివర్సిటీలో చేరారు. కాలిఫోర్నియోలోని హేస్టింగ్స్‌ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రాన్ని అభ్యసించి, అక్కడ బ్లాక్‌ లా స్ట్టూడెంట్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1990లో కాలిఫోర్నియాలో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని వృత్తిని ప్రారంభించారు.2002లో శాన్‌ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఎన్నికైన కమల.. ఈ పదవిని చేపట్టిన తొలి శ్వేతజాతీయేతర వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తన అసాధారణ ప్రతిభతో అందరి మన్ననలు పొందారు. కాలుష్యాల నివారణకు 2005లో ప్రత్యేకంగా ‘పర్యావరణ నేరాల విభాగా’న్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ సంబంధిత నేరాలపై కఠినంగా వ్యవహరించారు. ట్రాన్స్‌జెండర్లు వేధింపులకు గురవుతుండడంతో వారికి రక్షణ కోసం ‘హేట్‌ క్రైం’ విభాగాన్ని కూడా నెలకొల్పారు.ఉరిశిక్షలు బదులు యావజ్జీవిత శిక్షలు విధిస్తే మంచిదన్నది కమల అభిమతం.. ఈ విషయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆమె నిర్ణయాన్ని మార్చుకోలేదు. పిల్లలు పాఠశాలలకు వెళ్లకపోతే తల్లిదండ్రులకు శిక్ష విధించడం ఆమె హయాంలోనే చోటు చేసుకుంది. సరయిన కారణం లేకుండా 50 రోజుల పాటు స్కూల్‌కు వెళ్లకపోతే విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్ష పడింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇలాంటి శిక్షలు పడడం అదే తొలిసారి.

Related Posts