YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజేత ఎవరో మంగళవారం తేలనుంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర

ప్రజలందరి చూపు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై కేంద్రీకృతం కావడంతో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.
ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం కొనసాగించడం విశేషం. తెరాస తరఫున రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రచారం

హోరెత్తించగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పలువురు ప్రముఖులు భాజపా తరఫున ప్రచారంలో

విస్తృతంగా పాల్గొన్నారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నికకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలీసు

శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఓట్ల లెక్కింపుకు హిందూర్ కాలేజీలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును

వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించారు. ఇప్పుడు కొవిడ్ -19 నిబంధనలు అనుసరిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి రెండు హాళ్లలో

ఏడు టేబుళ్ల చొప్పున 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దాదాపు 200 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. 357 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు లో

పాల్గొంటున్నారు. సుమారు 100 మంది సాయుధ బలగాలు కూడా భద్రతలో పాల్గొనున్నారు.
ప్రవేశానికి ప్రత్యేక పాసులు  జారీ చేశారు. వాటి ఆధారంగా కేంద్రంలోకి వెళ్లేందుకు రెండు మార్గాలను నిర్దేశించారు. మీడియా, ఎన్నికల సిబ్బందికి, ఎన్నికల ఏజెంట్లకు లెక్కింపు కేంద్రం

సమీపంలో ఉండే సీపీ కార్యాలయం పక్క నుంచి అనుమతించనున్నారు. ఎన్నికల, పోలీస్ అధికారులు ప్రధాన ద్వారం నుంచి లోనికి వెల్లాల్సి ఉంటుంది. కౌంటింగ్ సెంటర్ దగ్గర  బారికేడ్లు

ఏర్పాటు చేశారు. కళాశాల ఆవరణలో ప్రెస్ గ్యాలరీ పక్కన, వీఐపీ వెహికల్ పార్కింగ్కు స్థలం కేటాయించారు. ఇతరులకు సీపీ కార్యాలయం వెనుకవైపు వాహన పార్కింగ్ సదుపాయం

కల్పించారు. కేంద్రం వద్ద లోనికి వెళ్లే మార్గాలు, లెక్కింపు హాళ్లలో ఇనుప చువ్వలతో జాలీలు ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్లను సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ

ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటలోపు పూర్తి కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ నేతృత్వంలో మొత్తం ఏడు సెక్టార్లుగా బందోబస్తును విభజించారు. విభాగాల వారీగా బలగాలను మోహరించనున్నారు. కేంద్రంలోని హాళ్లు, గ్యాలరీ,

ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, ఇతర ప్రాంతాల్లో నిఘా పై దృష్టి సారించారు. వారికి అదనంగా కేంద్రం ఆవరణలో రూఫ్టాప్, యాక్సెస్ కంట్రోల్, మెటల్ డిటెక్టర్ తదితర విభాగాలకు చెందిన మరో 15

మంది సిబ్బంది మఫ్టీలో ఉంటారు. వీరితో పాటు స్ట్రాంగ్ రూము వద్ద, ఆవరణలో కేంద్ర, ప్రత్యేక బలగాల భద్రత కొనసాగనుంది. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కేంద్రం పరిసరాలు,

పట్టణంలో పది పికెట్లు ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు రేపు మధ్యాహ్నం వరకు తేలిపోనున్నాయి. హోరాహోరి ప్రచారాలు, పోలింగ్ శాతం పెరగడం ఇవన్నీ

మరింత ఉత్కంఠకు దారితీసిన అంశాలు. ఎవరి జెండా ఎగురుతుంది అనే క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Related Posts