YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

మద్దతు ధర పై వైఫల్యం

మద్దతు ధర పై వైఫల్యం

తెలంగాణా రాష్ట్రంలో నీటిపారుదల, వ్యవసాయ రంగాలు ఆందోళనకరంగా ఉన్నాయని సిఎల్పి నేత బట్టి విక్రమార్క అన్నారు.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కాంగ్రేస్ ముఖ్యనాయకులతో
జూమ్మీటింగ్లో బట్టి పాల్గొన్నారు.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో వేల కోట్ల రూపాయల నిదులు దుర్వినియోగం అయ్యాయన్నారు.

దీనిపై కాంగ్రేస్పార్టీ కమిటి వేసిందని ఆకమిటి ప్రాజెక్టును సందర్శించి నిజనిజాలను తెలుసుకుంటుందన్నారు.. ఈనెల 18న ప్రాజెక్ట్ సందర్శనకు వెల్తున్నామన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో పంటనష్టం జరిగిందని కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం పంటనష్టం పై సర్వే చేయలేదన్నారు.. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిర్బంధ సాగు పేరుతొ రైతులను ప్రభుత్వం ఇబంది పెడుతుందన్నారు. వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రదానం గా జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని, కనీసం ఇప్పుడు మొక్కజొన్న సాగుకు రైతులు సిద్ధం అవుతుంటే అధికారులు వద్దని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగం అధోగతి పలు అవుతుందన్నారు.  ప్రభుత్వం రైతులకు మద్దతు ధరలో వైఫల్యం చెందింది.. మద్దతు ధర ఎవరి సొత్తుకాదని  మద్దతు ధర కల్పించేదాక పోరాటం చేస్తామన్నారు. 11న రైతుసమస్యల పై ఖమ్మం లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు..

Related Posts