విజయవాడలో పోలీసులు షూటింగ్ ను అడ్డుకున్నారు. ఆన్ లాక్ లో భాగం గా షూటింగ్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది .అయితే కరోన నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ క్రమంలో భవానిపురం హెచ్ బి కాలనీ లో టెలిఫిలిం షూటింగ్ ను నిర్వహిం చారు.విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ ప్రాంతానికి వ్యక్తి అనుమతు లు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా రోడ్ల పై హీరోయిన్లతో షూటింగ్ నిర్వహించా డు.హీరోయిన్లను చూడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకొని కరోనా సమయంలో భౌతిక దూరం పాటించకుండా కనీసం మాస్కులు లేకుండా అనుమతుల్లేని షూటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు.