YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉన్నతాధికారిణి నివాసంపై ఏసీబీ దాడులు

ఉన్నతాధికారిణి నివాసంపై ఏసీబీ దాడులు

కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అధికారిణి సుధ నివాసాలపై  ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని పలు ఆరోపణల నేపథ్యం లో ఏసిబి అధికారులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో తనికీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులు, ఖరీదైన ఎస్యూవీ కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్ని డాక్యు మెంట్లను సీజ్ చేశారు. బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ బీడీఏలో స్పెషల్ ల్యాండ్ అక్విజిషన్ అధికా రిణిగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె కర్ణాటక ఇన్ఫర్మేషన్ అండ్ బయో టెక్నాలజీ శాఖలో పని చేస్తున్నారు. బెంగళూరు లో ఆమెకు చెందిన అయిదు నివాసా లపై ఏకకాలంలో దాడులు చేపట్టారు ఏసీబీ అధికారులు.డాక్టర్ సుధ లంచం రూపంలో బంగారం, వాహనాలను తీసుకున్నట్లు తేలింది. లెక్క తేలని కోటి రూపాయల నగదు, అయిదు విలాసవంతమైన బంగళాలు, పెద్ద మొత్తంలో బంగారాన్ని గుర్తించామని, ఆమె ఆదాయానికి మించినవేనని నిర్ధారించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బెంగళూరులోని కోడిహళ్లి, యలహంకలోని శివనహళ్లి మెయిన్ రోడ్, బ్యాటరాయనపుర, మైసూరు లోని శ్రీరామ్పురా, ఉడుపిలోని హెబ్రి ప్రాంతంలో ఆమెకు ఫ్లాట్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2015లోనూ ఆమె నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు కూడా జరిపారు.

Related Posts