YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

నోట్ల రద్దు మోడీ తెలివితక్కువ నిర్ణయం - ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్

నోట్ల రద్దు మోడీ తెలివితక్కువ నిర్ణయం - ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్

ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు చేసి  నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్   కూడా నోట్ల రద్దు ఓ తెలివితక్కువ నిర్ణయం అంటూ ట్వీట్ చేశారు. ఈయన ట్వీట్లో ఏమన్నాడంటే..  ‘నరేంద్రమోదీ పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి నాలుగేళ్లు  పూర్తయ్యింది. ధనవంతులు దాచుకున్న బ్లాక్మనీని బయటకు తీసుకొస్తామని బీజేపీ నాయకులు  బీరాలు పలికారు. కానీ జరిగింది అందుకు విరుద్ధం.. నల్లడబ్బు దాచుకున్న పెద్దవాళ్లు తొందర్లోనే తమ డబ్బులను మార్చుకున్నారు. ఇబ్బంది పడింది నిరుపేదలే. ఈ విషయంపై ఇప్పుడు బీజేపీ భక్తులు స్పందించాలి. నిజానికి డిమానిటైజేషన్ ఓ తెలివితక్కువ నిర్ణయం. కష్టపడి పదివేలో ఐదువేలో కూడబెట్టుకున్న నిరుపేదలు బ్యాంకుల వద్ద పడిగాపులు గాశారే తప్ప.. బ్లాక్మనీ దాచుకున్న పెద్దలకు ఏ నష్టం కలుగలేదు. దీంతో మోదీ ఏం సాధించారో ప్రజలకు చెప్పాలి’ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. 2016 నవంబర్ 8న అవినీతి భరతం పడతామంటూ బీజేపీ ప్రభుత్వం రూ.500 రూ. 1000నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో జనం బిత్తర పోయారు. ఉన్న చిల్లర నోట్లనే చూసుకుని వాడుకుంటూ కొద్దికాలం గడిపారు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులలో మార్చుకునేందుకు ఎంతో అవస్థలు పడ్డారు. అంత చేసిన చివరికి నల్ల ధనం కూడా బ్యాంకులలో డిపాజిట్ అయి ఏమీ లాభం లేకుండా పోయింది. కాగా ఇది జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా నోట్ల  రద్దుతో ప్రధాని మోదీ ఏం సాధించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పేదలను ఇబ్బందులు పెట్టేందుకు నరేంద్రమోదీ ఈ తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నారని పలువురు పోస్టులు పెడుతున్నారు.

Related Posts