కర్నూలు మాజీ ఎంపీ.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న బుట్టా రేణుక.. రాజకీయం కీలక మలుపు తిరుగుతోందా ? ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ? ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమాలోచనలు చేశారా ? అంటే.. ఔననే అంటున్నారు కర్నూలు రాజకీయ పండితులు. “నిజానికి పార్టీ మారాలనేది మా నాయకురాలి ఉద్దేశం కాదు. కానీ, వ్యాపారాల రీత్యా అనుమతులు రావాలంటే.. రాజకీయంగాకొన్ని మార్పులు సహజం. అవి ఎలా ఉంటాయో.. ఇప్పుడే చెప్పలేం“-ఇదీ బుట్టా రేణుకకు సంబంధించిన రాజకీయ సలహాదారు ఒకరు మీడియాతో ఆఫ్ ది రికార్డుగా వెల్లడించిన విషయం. అది కూడా హైదరాబాద్‌లో.2014లో వైసీపీ తరఫున కర్నూలు ఎంపీగా విజయం సాధించిన రేణుక.. వ్యాపార విషయాల నేపథ్యంలోనే నాడు టీడీపీవైపు తొంగి చూశారనే వాదన ఉంది. వైసీపీలోనే ఉంటూ.. ఆమె బాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. బాబు పాల్గొన్న కార్యక్రమాలకు హాజరయ్యారు. అంతేకాదు.. బాబు అభివృద్ధికి తాను ఫిదా అయ్యానంటూ.. టీడీపీ అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. తర్వాత.. గత ఏడాది ఎన్నికల్లో ఆమె కోరుకున్న అసెంబ్లీ టికెట్ ( ఎమ్మిగనూరు ) దక్కకపోయే సరికి.. జగనన్నే బెటర్ అంటూ.. మళ్లీ వచ్చేశారు. అయితే, దీనివెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కీ ఉందని అంటారు.బుట్టా రేణుక కుటుంబానికి హైదరాబాద్ సహా ఢిల్లీలో విద్యాసంస్థలు ఉన్నాయి. ఆమె భర్త నీలకంఠం డైరెక్టర్‌గా ఉన్న ఈ సంస్థల అభివృద్ధి విషయంలో ఢిల్లీలో పెద్దలను కలిసిన మాట వాస్తవమే. అయితే, ఈ సందర్భంగా రాజకీయాలు చర్చకు వచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం కర్నూలుపై బీజేపీ పెద్దలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేయడంలో తమకు అభ్యంతరం లేదని హైకోర్టుకు కూడా బీజేపీ పెద్దలు అఫిడవిట్ ఇచ్చారు. అంటే.. ఎదుగుతున్న కర్నూలులో బీజేపీకి సారథ్యం వహించే బలమైన నాయకులు అవసరం. ఇప్పటికే కోట్ల కుటుంబాన్ని పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నించినా.. చంద్రబాబు అడ్డుపడ్డారని వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో బుట్టా రేణుక వంటి కీలక నాయకురాలిని పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. బుట్టాకు వ్యక్తిగత ఇమేజ్‌కానీ, కేడర్‌కానీ బలంగా లేకపోవడం. అయినా.. బీజేపీ నేతలు ఆమెను కోరుతున్నారా ? లేక వైసీపీలో ఉంటే.. ఇప్పట్లో ఎలాంటి పదవీ దక్కే ఛాన్స్ లేదని ఆమె బీజేపీ వైపు చూస్తున్నారా? అనేది సస్పెన్స్‌గా ఉంది.