YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

24 గంటల్లో 80 శాతం ఏటీఎంలలో క్యాష్

24 గంటల్లో 80 శాతం ఏటీఎంలలో క్యాష్

 ఏడాదిన్నర కిందట చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రభావం మరోసారి దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల పెద్దలతో సమావేశమైంది. దేశంలో తీవ్ర నగదు కొరత నెలకొని ఉండటం,  నగదు లేక ఏటీఎంలు వెలవెలబోతుండటం, బ్యాంకుల్లో, ఏటీఎంల్లో డబ్బులు దొరకక ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో కేంద్రం భేటీ అయింది. దేశంలోని ఆర్థిక కార్యకలాపాలు, లావాదేవీలు, నగదు ప్రవాహం సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీచేసింది. 24 గంటల్లో దేశంలోని 80శాతం ఏటీఎంలు పనిచేస్తాయని, నగదు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఈ సందర్భంగా భరోసా ఇచ్చింది. ఆర్బీఐ కూడా నగదు కష్టాలపై స్పందించింది. ఏటీఎంల వద్ద పరిస్థితి మెరుగుపడుతోందని, నగదు కొరత కష్టాలు క్రమంగా తొలగిపోతున్నాయని ఆర్బీఐ తెలిపింది.మరో వైపు దేశవ్యాప్తంగా నోట్ల కష్టాలు జనాల్ని వెంటాడుతున్నాయి. ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులే కనబడుతున్నాయి. ఈ కొరత తాత్కాలికమని చెబుతున్నా... సమస్య మాత్రం ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ కూడా త్వరలోనే ఇబ్బందులన్నీ సర్థుకుంటాయని చెప్పారు. కాని వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఆర్బీఐ నోట్ల ముద్రణను నిలిపి వేసినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. పేపర్, ఇంక్ కొరత వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. కరెన్సీ పేపర్‌ దిగుమతులు 30 శాతం తగ్గాయట. దీనికి తోడు నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీని ముద్రించాల్సి వచ్చింది. అప్పటికే పేపర్ కొరత ఉండటం... ఆ తర్వాత కొత్త నోట్ల ప్రింటింగ్‌తో మొదలైన పేపర్ సమస్య ఇంకా కొనసాగుతుందట. ఇప్పటికీ ఆర్బీఐ దగ్గర కరెన్సీ పేపర్ కొరత తీవ్రంగా ఉందట... ఈ ప్రభావం రూ.2000, రూ.500, రూ.100 నోట్ల ప్రింటింగ్‌పై పడిందని తెలుస్తోంది. అలాగే డిమాండ్‌కు తగ్గట్లు... నోట్ల ముద్రణకు సంబంధించిన మిషనరీ సామర్థ్యం కూడా సరిపోవడం లేదట. అయితే అధికారులు మాత్రం మరో వారంలో అన్ని సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.

Related Posts