డుంబ్రిగుడ మండలంలో గల కోరాయి పంచాయితీ పరిధిలో ఉన్న సాయి నగర్ గ్రామ సమీపంలో అనుమతి లేకుండా క్వారీ క్రషర్ నిర్మాణానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.సురేంద్ర కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ చుట్టుపక్కల ఉన్న గ్రామలు సాయి నగర్,బలుగుడ,బొందుగుడ గ్రామాల గిరిజనుల పంట పొలాలు క్వారీ క్రషర్ నిర్మాణం వలన దుమ్ము ధూళి కాలుష్యం వెదజల్లే ప్రమాదముందని దీనివల్ల పంట పొలాలు తీవ్ర నష్టపోతాయన్నారు.క్వారీ క్రషర్ నిర్మాణానికి అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారని తక్షణమే క్రషర్ క్వారీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.గ్రామాల పంట పొలాల దగ్గర క్రషర్ నిర్మాణం పనులు అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని గిరిజన ప్రాంతంలో మైనింగ్ క్వారీ క్రషర్ నిర్మాణం చెయ్యాలంటే చట్టప్రకారం గ్రామ సభ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలి.వ్యవసాయ భూములు వాణిజ్యపరమైన కార్యక్రమాలు చేయాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉన్న గ్రామ సభ అనుమతి లేకుండా క్వారీ క్రషర్ నిర్మాణ పనులు ఎట్లా చేస్తున్నారని మండిపడ్డారు.దీనిపై ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోనీ క్రషర్ క్వారీ నిర్మాణం పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు వి.రామ్మూర్తి,వి.రాంబాబు పాల్గొన్నారు.