రెవిన్యూ విభాగంలో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు మండలాల వారీగా రివ్యూ మీటింగ్ లు నిర్వహించి వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు నెల్లూరు జిల్లా చిల్లకూరు తాసిల్దార్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ రివ్యూ సమావేశం నిర్వహించారు
నెల్లూరు జిల్లా చిల్లకూరు లోనీ తాసిల్దార్ కార్యాలయంలో గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ రెవెన్యూ అధికారులతో రివ్యు మీటింగ్ నిర్వహించారు మండలంలో గ్రామాల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలు ను అడిగి తెలుసుకున్నారు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా రెవెన్యూవిభాగంలో అనేక భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆ సమస్యలను తెలుసుకునేందుకు మండలాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అలాగే తమ సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ రోజులు తరబడి తిరగకుండా గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయల వద్ద ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు ఈ సమావేశంలో తాసిల్దార్ గీతా వాణి ,వీఆర్వోలు సిబ్బంది పాల్గొన్నారు