తిరుమలలో కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. సినిమా రేంజ్ లో తిరుమలలో కిడ్నాప్ కు పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. నెల్లూరుకు చెందిన హనుమంత రావు అనే వ్యక్తి భార్యతో సహా శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చారు. దర్శనం ముగించుకొని సురాపురం తోట కాటేజ్ వద్ద ఉన్న హనుమంత రావును ఇన్నోవా కారులో కిడ్నాప్ చేశారు. భర్త కిడ్నాప్ కు గురి కావడంతో డయల్ 100కు కాల్ చేసి పిర్యాదు చేసి, భర్తను కిడ్నాప్ చేసిన కారు నెంబర్ తో సహా హనుమంత రావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. డయల్ 100 ద్వారా ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేవలం 25 నిమిషాల్లో కేసును ఛేదించారు. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో తిరుపతి తిరుపతి పొలిమేరలు దాటకుండానే కిడ్నాప్ కు గురైన హనుమంత రావు తో పాటుగా కిడ్నాప్ కు పాల్పడ్డ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు తిరుమల పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆర్థిక లావాదేవీలు కారణంగా హనుమంత రావును కిడ్నాప్ చేసినట్లు ధ్రువీకరించారు.
అనంతపురంలోని కియా మోటార్ సంస్థ ప్లాంట్ లో క్యాంటీన్ నడుపుతున్న హనుమంతరావు రూ.20లక్షలు మోసం చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. మూడు రోజుల క్రితం పెనుగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి హనుమంత రావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు అనంతపురం పోలీసులు అప్పటి నుంచి హనుమంతరావు అనంతపురం విడి అదృశ్యం కావడంతో పెనుగొండకి చెందిన శ్రీను, శ్రీకాళహస్తి నుంచి పెనుగొండలో సురేష్, కుమార్ అనే వ్యక్తులు కిడ్నాప్ చేసారని పోలీసులు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తిరుమల టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.