YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దాహామో...మహా ప్రభో...

దాహామో...మహా ప్రభో...

హిందూపురంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది.  వేసవి ఆరంభం నుంచి నీటి గండం ముంచుకొస్తోదంటూ పలు దఫాలుగా ప్రతిపక్షం హెచ్చరిస్తున్నా.. ప్రజాప్రతినిధుల్లో చలనం లేకుండా పోయింది. ఇప్పటికే హిందూపురంలో సిపీఐ నేతలు ఆందోళనకు దిగారు.. ఎమ్మెల్యే బాలయ్యా, మా నీటి సమస్యలు తీర్చవయ్యా అంటూ వినూత్నరీతిలో నిరసన తెలిపారు.. కాలనీవాసులతో కలిసి ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.. కమిషనర్‌ చాంబర్‌ ముందు బైఠాయించారు.. మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని... అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని నేతలు ఆరోపించారు. మరో వైపు హిందూపురం లో మంచి నీరు అందించేందుకు ప్రణాళికలు తయారు చేసిన... సాంకేతిక సమస్య తో అనుకున్నట్టు నీళ్లు రాలేదు.మున్సిపాలిటీ పరిధిలో రోజురోజుకూ ఎక్కువవుతున్న తాగునీటి ఎద్దడి నివారణలో ఎమ్మెల్యే బాలకృష్ణ, మున్సిపాలిటీ పాలక వర్గం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అన్నివార్డులకు ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటిని అందిస్తున్నామని మున్సిపల్‌ పాలకులు చెబుతున్నా వాస్తవంగా ఒక రోజు తాగునీటి కోసం హిందూపురం వాసులు రూ. వందల్లోనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.  ఇంతదారుణమైన తాగునీటి ఎద్దడిని ఈ 30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదంటూ స్థానికులు పేర్కొంటున్నారు..ఒక లక్ష 60వేల జనాభా ఉన్న హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజావసరాలకు రోజుకు దాదాపు పది మిలియన్‌ లీటర్ల నీరు అవసరం. అయితే మున్సిపాలిటీకి ప్రధాన నీటి వనరుగా ఉన్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా రోజుకు మూడు మిలియన్‌ లీటర్ల నీరు కూడా సక్రమంగా అందడం లేదు.  ఇక స్థానికంగా ఉన్న బోరు బావుల నుంచి రెండు మిలియన్‌ లీటర్ల కంటే తక్కువే నీరు లభ్యమవుతోంది. ఇది కూడా రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. వేసవి ప్రారంభం కాక ముందు నుంచే హిందూపురంను నీటి కష్టాలు వెన్నాడుతున్నాయి. ఇదే విషయంపై ఎప్పటికప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ ఆందోళనలు చేపడుతూ.. సమస్య తీవ్రతను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చింది. పలు దఫాలుగా జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లోనూ నీటి సమస్యపై వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు ప్రస్తావిస్తూ వచ్చారు. అయినా పాలకవర్గంలో చలనం లేకుండా పోయింది.  వేసవి ఆరంభం నుంచి ఖాళీ బిందెలతో రోడ్లపైకి చేరుకోవడం మొదలు పెట్టారు. కాలనీలకు కాలనీలు.. వార్డులకు వార్డులు.. తాగునీటి కోసం ఉద్యమ బాట పట్టాయి. ఆందోళనను సద్దుమణిగించేందుకు చర్చలకు దిగివచ్చిన అధికార, పాలక వర్గ సభ్యులు.. ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటి కష్టాలు తీరుస్తామంటూ హామీనిచ్చారు. రోజులు గడుస్తున్నా... నేటికీ ట్యాంకర్లు ఆ ప్రాంతంలో కనిపించడం లేదు.  

Related Posts