ఏపీ సర్కార్ దూకుడు చూస్తూనే ఉన్నాం. ఏపీ రాజధాని విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. కానీ.. ఇద్దరు సినిమా వాళ్లు వేసిన పిటిషన్ పై నోరెళ్ల బెడుతోంది ఏపీ సర్కార్. కోర్టులో పిటిషన్ ఉన్నా.. కౌంటర్ ఇచ్చే సిచ్చువేషన్ కూడా లేదు. ఆ పిటిషన్ లు వేసింది ఎవరో కాదు. ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. రెబల్ స్టార్ క్రిష్ణం రాజు.ఏపీ సెపరేట్ అయిన తర్వాత.. విమానాశ్రయాల విస్తరణకి అంతా ప్లాన్ రెడీ అయింది. ఆ టైంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు భూమి అవసరం వచ్చింది. రన్ వే పెంచాలంటే.. ల్యాండ్ కావాలి. సో.. భూములు సేకరించాలి. కానీ.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి భూమి సేకరించడం ప్రాబ్లమ్ గా మారింది. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఏపీ సర్కార్.. భూములు సేకరించే ప్రయత్నం చేసింది. ఆ టైంలోనే.. ఆ పక్కనే పొలం ఉన్న అశ్వనీదత్.. క్రిష్ణం రాజులు భూములు ఇచ్చారు. ఫలితంగా అమరావతిలో వారికి ల్యాండ్స్ కేటాయించారు. ఈ ఒప్పందంపై మిగతా రైతులు కూడా భూములు ఇచ్చారు. ఫైనల్ గా చూస్తేనేమో ఇప్పుడు అంతా రివర్స్ అయింది.ఇప్పుడేమో అమరావతిలో రాజధాని లేదు. రాజధాని కాబట్టి వాళ్లు భూమి తీసుకున్నారు అక్కడి భూమి ఇచ్చారు. ఇప్పుడు తాము తీసుకున్న భూమి ఎందుకు పనికిరాదు అని.. తమకు ఇచ్చిన ఒప్పందానికి కట్టుబడకపోతే.. 210 కోట్లు చెల్లించాలని అశ్వనీదత్ పిటిషన్ వేశారు. దీనిపై క్రిష్ణం రాజు కూడా విడిగా పిటిషన్ వేశారు. అశ్వనీదత్ 39 ఎకరాలు, క్రిష్ణం రాజు 31 ఎకరాలకు సంబంధించిన పిటిషన్ లు అలాగే నడుస్తున్నయ్. కానీ.. సర్కార్ మాత్రం దీనిపై వాదనకు రావడం లేదు. కౌంటర్ కూడా దాఖలు చేయకుండా టైం తీసుకుంటోంది. ఈ పిటిషన్ లకు ఆన్సర్ ఇచ్చే సిచ్చువేషన్ లేని సిచ్చువేషన్