YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జిల్లా అభివృద్ది సమీక్షా

 జిల్లా అభివృద్ది సమీక్షా

విశాఖ జిల్లా అభివృద్థికి అందరం  కలసికట్టుగా పనిచేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.  బీచ్ రోడ్ లోని ఆంధ్రాయూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో జిల్లా అభివృద్థి సమీక్షా మండలి సమావేశం తరువాత విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కురిసిన వర్షాల్లో నష్టపోయిన వాటిపై చర్చించడం జరిగిందని చెప్పారు.  నాడు – నేడు లో భాగంగా  కార్పొరేట్ స్కూల్స్ వలే తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.  నాణ్యతలో విషయంలో రాజీలేదని పేర్కొన్నారు.  ఏ ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమణలకు గురికాకుండా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.  మైనింగ్ అధికారులు పనితీరును మరింత మెరుగు పరచుకోవాలన్నారు.   వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 16 ఆసుపత్రులను రేషనలైజేషన్ చేసి ఎక్కడ అవసరమో అక్కడ వైద్యులను సర్థుబాటు చేయాలని కలెక్టర్ కు సూచించినట్లు చెప్పారు.  గిరిజనులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.  జిల్లాలో అనకాపల్లి, పాడేరులలో  వైద్య కళాశాలు మంజూరు చేసినందుకు, గిరిజనులకు పట్టాల పంపిణీకి చర్యలు తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్య మంత్రికి  జిల్లా అభివృద్థి సమీక్షా మండలి నుండి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts