చిన్న, సన్నకారు రైతులను సీఎం జగన్ ఆదుకుంటున్నారు. మెట్టభూములకు సాగునీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ జలకళ పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ వుండవల్లి శ్రీదేవి అన్నారు.
గుంటూరు జిల్లాలో మొదటి సారి తాడికొండ నియోజకవర్గంలోని నిడుముక్కల గ్రామంలోని దాసరి రాంప్రకాష్ అనే రైతు పోలంలో వైఎస్ఆర్ జలకళ పథకం కింద ఉచితంగా బోర్ వేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పూజలు చేసి బోర్వెల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్తాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్టభూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు.
బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన సీఎం జగన్ మోహన్ రెడ్డిగారు వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారని.. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నెరవేర్చడం కోసం రూ.2340 కోట్ల రూపాయలను కేటాయించారనన్నారు.
అలాగే రైతులకు ఉచితంగా వేసిన బోర్లతో పాటు ఉచితంగా మోటర్ ను కూడా అందించనున్నట్లు వెల్లడించారు..ఉచితంగా మోటార్లను అందజేసేందుకు రూ.1600 కోట్లను కేటాయించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కతుందన్నారు.
ఈ పథకానికి అర్హులు ఎవరూ
గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను తొలుత వీఆర్వీ పరిశీలించనున్నారు. అక్కడి నుంచి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపనున్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతిస్తారు. ఏపీడీ అనుమతి అనంతరం కాంట్రాక్టర్ బోరుబావులను తవ్వుతారు. ఒకసారి బోర్ వెల్ విఫలమైతే మరోసారి కూడా బోర్ వేస్తారు. బోర్ వేయడం పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్ తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్ తో కూడిన డిజిటల్ ఫోటో తీయనున్నారని అన్నారు.
ఇక 2.5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులైతే, ఇద్దరు ముగ్గురు పొగై బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి. సీఎం జగన్ మోహన్ రెడ్డిగారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని మెట్ట ప్రాంతా రైతులతో పాటు నీటి ఆధారం లేని రైతులు సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు. రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 లను రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారని..అలాగే రైతుల పండించిన పంటల ధరల స్థిరికరణ కోసం రూ.3 వేల కోట్ల ను కేటాయించారన్నారు. రైతులన అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం జగన్ గారి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు.
ఈ కార్యక్రమాంలో పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, గుంటూరు జిల్లా డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో దాసరి అనురాధ, వైసీపీ నాయకులు బండ్ల పున్నారావు, మండల అధ్యక్షులు బ్రహ్మారెడ్డి, హనుమంతురావు, పలువురు అధికారులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
====================