YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దీపావళి లోగా టిడ్కో ఇళ్లు అప్పగించాలి

దీపావళి లోగా టిడ్కో ఇళ్లు అప్పగించాలి

దీపావళి లోగా టిడ్కో లబ్ధిదారులకు  ప్రభుత్వం ఇళ్లను అప్పగించాలని, లేనిపక్షంలో 16వ తేదీన లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. విశాఖలోని మిథిలాపురి  వుడా కాలనీ సమీపంలోని సుద్దగెడ్డ వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇల్లు అప్పగించడం తో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షలకు పైచిలుకు టిడ్కో ఇళ్లను నిర్మించారని చెప్పారు. లబ్ధిదారుల నుంచి 50,000 చొప్పున, లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం వసూలు చేసిందని అన్నారు. లబ్ధిదారులు అప్పు చేసి ఈ డబ్బులు చెల్లించారని చెప్పారు. రాష్ట్రంలో అనేక చోట్ల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు. చాలాచోట్ల లబ్ధిదారులు ఇళ్లలో నివాసం ఉండేలా విద్యుత్, తాగునీటి సదుపాయం కల్పించాలని చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిందన్న ఏకైక కారణంతో వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇల్లు అప్పగించడం లేదని విమర్శించారు. తగవులు ఏమైనా ఉంటే  చంద్రబాబు, జగన్  చూసుకోవాలని, లబ్ధిదారులను ఇబ్బంది పెడితే సహించబోమని హెచ్చరించారు. కర్నూలు, అనంతపురం, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో నిర్మించిన ఇళ్లను పరిశీలించినట్లు చెప్పారు. కొన్నిచోట్ల ఫ్లోరింగ్ కూడా వేసారని, కొన్నిచోట్ల విద్యుత్ మీటర్లు, కొన్ని చోట్ల తాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు కర్నూలులో టిడ్కో ఇళ్లను కోవిడ్ పేషెంట్ల కోసం కేటాయించారని చెప్పారు. వారు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పలు ప్రాంతాల్లో ఇళ్లను కట్టిస్తామని చెప్పి నివసిస్తున్న ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని అన్నారు. ఇళ్లను నిర్మించిన తరువాత వారికి వెంటనే అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. టిడ్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వ వైఖరి సరైనది కాదని విమర్శించారు.
 పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్థలాలను సేకరించారని చెప్పారు. అయితే  ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు సార్లు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసిందని అన్నారు. పేదలకు సెంటు స్థలం ఇస్తామనడం సమంజసం కాదని అన్నారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున స్థలాలను ఇవ్వాలని అన్నారు. సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుని ఎలా ఉండగలలని ప్రశ్నించారు. ఉండవల్లిలో సెంటు స్థలం లో ప్రభుత్వం పెట్టిన ఇంటిని పరిశీలించినట్లు చెప్పారు. రంగులన్నీ చక్కగా వేశారని అన్నారు. అయితే ఆ ఇల్లు ఒక కుటుంబం నివసించడానికి ఏ మాత్రం సరిపోదని చెప్పారు. పట్టణాలకు, గ్రామాలకు దూరంగా ఎక్కడో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే పేదలు ఆ ప్రాంతాల్లో ఎలా నివాసం ఉండగలరని రోజువారీ పనులకు ఎలా వెళ్ళగలను ప్రశ్నించారు. పెద్దలు భారీ భవనాలు లోనూ పేదలు అతి చిన్న ఇళ్లలోనూ నివసించాలంటే ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 2006లో జివిఎంసి పరిధిలో లక్షల 36 వేల కుటుంబాలకు సొంత ఇల్లు లేదని తేల్చాలని చెప్పారు వారందరికీ కీ సొంత ఇల్లు కట్టిస్తామని చెప్పాడని తెలిపారు. 96 వేలు టిడ్కో ఇల్లు మంజూరు అయ్యాయని వాటిలో  26,000 ఇల్లు కట్టారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టారని వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టడం సరైనది కాదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు.
 ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ జె స్టాలిన్ జిల్లా నగర కార్యదర్సులు బాలేపల్లి వెంకటరమణ ఎం పైడిరాజు జిల్లా నగర కార్యవర్గ సభ్యులు ఎ విమల  బి వెంకటరావు నగర సహాయ కార్యదర్సులు కె సత్యాంజనేయ ఎస్ కె రెహమాన్ జి రాంబాబు ఆర్ శ్రీనివాసరావు తదితరులతో పాటు టిడ్కో ఇల్లులకు ఎంపిక కాబడిన లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
================

Related Posts