విశాఖ లో వైసీపీ లోకి భారీగా వలసలు నమోదయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలువురిని పార్టీ లోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరారు. విశాఖ జిల్లా సితమ్మధారలోని మంత్రి వర్యులు క్యాంప్ కార్యాలయంలో వైసీపీలో చేరారు. వారికి మంత్రి వర్యులు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ప్రియ గార్డెన్ అధ్యక్షులు తోమురోతు రాము, జన్మభూమి కమిటీ సభ్యులు, శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు రిసి రాము, సింహాచలం టిడిపి మార్కెట్ యూత్ అధ్యక్షులు పెద్దిరెడ్డి అశోక్ ,సీనియర్ నాయకులు గాజుల సత్తిబాబు, బంటుబిల్లి నారాయణ, రాంబాబు వీరితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పలువురు వైసీపీ లోకి చేరారు.
ఈ సందర్భంగా మంత్రి వ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో ఎవ్వరు చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ, కులం, మతం , చూడకుండా అన్ని పథకాలను అందిస్తున్నామని అన్నారు.
మానిఫెస్ట్ లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం తో పాటు.. ఇవ్వని హామీలను సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారు. సింహాచలం , అడవివరం నుంచి వర్తకులు, కార్మికులు, పలు సంఘాల అధ్యక్షులు, నాయకులు చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, 98 వార్డ్ కార్పొరేట్ అభ్యర్ది వరాహ నరసింహ. సింహాచలం మార్కెట్ అధ్యక్షులు లంక సత్తిబాబు, సింహాచలం నగర కార్యదర్శి లు రామరాజు, దాసరి కనకరాజు, సీనియర్ నాయకులు , సింహాచలం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సిరిపురం కృష్ణ తదితరులుపాల్గొన్నారు