పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పొలమూరు , ఆచంట వేమవరం , పెనుమంచిలి గ్రామాల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధరాజు ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు మూడేళ్ళు పూర్తైన సందర్భంగా ఐదవ రోజు పెనుమండ్ర ,ఆచంట మండల పలు గ్రామాల్లో పాదయాత్ర లో పాల్గొన్నారు మంత్రి రంగనాధరాజు.ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు ఇప్పటివరకు ఏమి అందాయి,ఇంకా రావాల్సిన పథకాలు ఉన్నాయా సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆచంట వేమవరంలో చేనేత కార్మికులకు చేనేత మగ్గాలు అందచేస్తామని ,ఇంకా ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఇప్పటివరకు ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయంగా పని చేస్తున్నారని మంత్రి అన్నారు.వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు ,రైతులకు మంచి సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నారని దాని వలన వాలంటీర్లు అందరి మనన్నలు పొందుటం జరుగుతుందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో సుంకర సీతారామ్,గొడవర్తి వెంకన్నబాబు , వైట్ల కిషోర్, గెద్దాడ మంగారావు,ఉమేష్ ,దేవిరెడ్డి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.