తిరుమలను రోజు వివాదస్పద కేంద్రం గా ఎందుకు మార్చుతున్నారు. ఎస్ వి బి సి రోజు వివాదస్పదంగా మారడానికి కారకులెవరని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి. విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. -హిందూ ధర్మ ప్రచారం విషయంలో ఎస్విబిసి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. - గతంలో అయోధ్య ప్రసారం విషయంలో కూడా ఇలాగే వివాదం చేశారు. ఎస్ వి బి సి ని ప్రక్షాళన చేయండి. 250 మంది ఉద్యోగులకు కోట్ల రూపాయల జీతాలు ఏందుకు ఇస్తున్నారు. అవసరం లేకున్నా 50 వేల జీతాలు ఇచ్చి తిరుమల ప్రతిష్టను దిగజార్చుతారా అని అడిగారు. శతమానం భవతి కార్యక్రమంలో అసభ్యకరమైన ఇటువంటి దృశ్యాలు భక్తులు పంపిన వారిపై చర్యలు తీసుకోని శాశ్వతంగా తొలగించాలి. ఎస్ వి బీసీ లో కోట్ల రూపాయలు జీతాలు తీసుకొని ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడే సిబ్బందిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టడంలేదు. ఎస్వీబీసీ సంబంధించిన 100 మంది సిబ్బంది అవసరం అయితే 250 మంది నియామకాలు ఎందుకు చేశారు ? ఎస్ వి బిసి లో నీలి చిత్రాలు పంపిన వారిని శాశ్వతంగా ఉద్యోగుల నుంచి తొలగించండని ఆమె డిమాండ్ చేసారు.